పాకిస్తాన్లో పరిస్థితులు రోజురోజుకీ దారుణంగా తయారవుతున్నాయి. ఇటీవలే వరదలతో అతలాకుతలం అయిన ఆ దేశాన్ని తీవ్ర ద్రవ్యోల్బణం, పెట్రోల్ రేట్లు పెరగడం, నిల్వలు తగ్గిపోవడం, కరెన్సీ విలువ పతనం వంటివాటితో పాటు తాజాగా గ్యాస్ సిలిండర్ల కొరత కూడా వేధిస్తున్నది. దీంతో ప్రజలకు వేరే దిక్కు లేక వంట గ్యాస్‌ను ప్లాస్టిక్ కవర్లలో నిల్వ చేసి రోడ్డుపై ఈడ్చుకెళుతున్నారు. ఈ దృష్యాలు సోషల్ మీడియాలో రావడంతో ఆ దేశ దుస్థితి మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని ప్రజలు ఈ విధంగా ప్లాస్టిక్ కవర్లలో వంట గ్యాస్ నింపి తీసుకెళుతున్నారు. సిలిండర్ల కొరతతో విక్రేతలు వంట గ్యాస్‌ను ప్లాస్టిక్ కవర్లలో మూడు నుంచి నాలుగు కిలోలు నింపి నాజిల్ వాల్వ్‌తో కవర్ ముందు భాగాన్ని మూసేసి ఓ పైపు తగిలిస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియకు సుమారు గంట సమయం పడుతుందని అక్కడి మీడియా చెప్తోంది. ఈ వీడియో వైరల్ కావడంతో అప్రమత్తమైన స్థానిక యంత్రాంగం వెంటనే ప్లాస్టిక్ బ్యాగులపై ఆంక్షలు విధించింది. కాగా, ఆ దేశంలో నిరుద్యోగం కూడా తీవ్ర స్థాయికి చేరింది. ఇటీవల కొన్ని కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించగా, అందరు అభ్యర్ధులకు పేపర్ ఇతర మౌలిక వసతులు సమకూర్చేందుకు నిధులు లేక ఓ మైదానంలో పరీక్ష పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక ఫారెక్స్ నిల్వలు మరీ అడుగంటిపోతున్నాయి. సుమారు 6 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నిధులు లేవని, ఇవి బహుశా ఓ పక్షం రోజులు దిగుమతి అవసరాలకు సరిపోతాయోమోనని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇన్ని గండాలను ఆ దేశం ఎప్పుడు, ఎలా దాటుతుందో చూడాల్సి ఉంది.
Residents of Karak carry gas for their household needs in plastic bags because there is no natural gas supply to residences.
The Pakistani establishment has totally failed here!
1/2@husainhaqqani pic.twitter.com/QBqf0XX1PR— Tahreem Akhtar (@Tahz42) January 2, 2023
ఇవి కూడా చదవండి :
నిన్నటిదాకా చంద్రబాబును అన్నారు.. ఇప్పుడు జగన్ సభలో
ఏపీలో నిషేధం అమలు.. ఇక నుంచి కేసులు నమోదు