కరోనాలోనూ రెచ్చిపోయిన పాక్ ఉగ్రమూక.. హతమార్చిన భారత్ - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాలోనూ రెచ్చిపోయిన పాక్ ఉగ్రమూక.. హతమార్చిన భారత్

April 4, 2020

Pakistan firing at Kashmir border 

ప్రపంచమంతా కరోనా భయంతో వణుకుతోంది. పాకిస్తాన్‌లోనూ 3 వేల కేసులు నమోదయ్యాయి. కానీ అక్కడి ఉగ్రవాదులు మాత్రం ఈ ఉపద్రవంలోనూ ఉన్మాదంతో పేట్రేగుతున్నారు. భారత సరిహద్దుల్లో వారం రోజులుగా కాల్పులకు తెగబడుతున్నారు. అభం శుభం తెలియని పౌరులను పొట్టనబెట్టుకుంటున్నారు. జమ్మూకశ్మీర్‌లో వారం రోజులుగా జరిగిన ఉగ్రదాడుల్లో నలుగురు పౌరులు బలయ్యారు. వారి కాల్పులను భారత సైన్యం కూడా దీటుగా తిప్పుకొడుతోంది. 

ఈ రోజు ఉదయం కుల్గాం జిల్లా హర్దామాంజెర్ బతపొరాలో జరిగిన ఎన్ కౌంటర్లో నలుగురు ముష్కరులను కాల్చిచంపింది. హతుల్లో ముగ్గురిని ఫయాజ్, అదిల్, మహమ్మద్ షాహిద్‌గా గుర్తించారు. వీరు  కుల్గామ్‌ జిల్లా నందిమార్గ్‌లో ప్రజలను కాల్చిచంపినట్లు పోలీసులు తెలిపారు.