పాక్ పైశాచికం.. ముగ్గురు భారతీయ జవాన్లు మృతి  - MicTv.in - Telugu News
mictv telugu

 పాక్ పైశాచికం.. ముగ్గురు భారతీయ జవాన్లు మృతి 

October 1, 2020

Pakistan firing cross boarder .

పాకిస్తాన్ ఉన్మాదానికి అంతులేకుండా పోతోంది. ఈ రోజు జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో కాల్పులు విరమణకు తూట్లు పొడిచి పైశాచికంగా కాల్పులు జరిపింది. ముగ్గురు భారత జవాన్లు అమరులు కాగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అంతర్జాతీయ వేదికల్లో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి భంగపడుతున్న పాక్ ఆ పగతో సరిహద్దుల్లో రాక్షసకాండకు తెగుబడుతోంది. 

భారత ఆర్మీ ఔట్‌పోస్టులను టార్గెట్ చేసుకుని మోర్టారు బాంబులతో దాడి చేసింది. కుప్వారా జిల్లాలోని నౌగామ్ సెక్టార్‌లో జరిగిన మోర్టార్ల కాల్పుల్లో ఇద్దరు సైనికులు చనిపోగా,  మరో నలుగురు గాయపడ్డారు. పూంచ్ సెక్టార్‌లో పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో మరొక జవాన్ కన్నుమూశాడు. అతణ్ని లాన్స్ నాయక్ కర్నాల్ సింగ్‌గా గుర్తించారు. పాక్ దాడులను దీటుగా తిప్పుకొడుతున్నామని, పాక్ వైపు జరిగిన ప్రాణనష్టం వివరాలు తెలియడం లేదన రక్షణ శాఖ తెలిపింది. పాక్ కొన్ని రోజులుగా సరిహద్దులో విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడుతోంది. సెప్టెంబర్ 5న దాయాది జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు చనిపోయారు. సెప్టెంబర్ 2నాటి కాల్పల్లో మరో భారత జవాను కన్నుమూశాడు.