సుప్రీం తీర్పు చెప్పిన సమయం సరికాదని..పాక్ మంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

సుప్రీం తీర్పు చెప్పిన సమయం సరికాదని..పాక్ మంత్రి

November 10, 2019

శనివారం సుప్రీం కోర్టు అయోధ్య భూవివాదం కేసులో తుది తీర్పు వెలువరించిన సంగతి తెల్సిందే. ఈ తీర్పును భారత్‌లోని అన్ని ముస్లిం సంఘాలు సాదరంగా ఆహ్వానించాయి. కానీ, దాయాది దేశం పాకిస్థాన్ మాత్రం సుప్రీం తీర్పును విమర్శిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పుతో మైనారిటీలకు అన్యాయం జరిగిందని ఆదేశ విదేశాంగ శాఖ మండిపడింది. 

Pakistan Foreign Minister.

భారత్‌లో ముస్లిం మైనారిటీలకు భద్రత లేదని సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మరోమారు రుజువైందని ఆవేదన వ్యక్తం చేసింది. భారత్‌ను హిందూదేశంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఆరెస్సెస్ తన హిందుత్వ ఎజెండాను అమలు చేసేందుకు చరిత్రను తిరగ రాస్తోందని ఆరోపించింది. అయోధ్యపై తుది తీర్పు వెలువరించేందుకు ఆ దేశ సుప్రీంకోర్టు ఎంచుకున్న సమయం సరికాదని పాక్ విదేశాంగశాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ పేర్కొన్నారు.