Pakistan gave a sweet return gift to the Netherlands
mictv telugu

సెమీస్‌కి చేర్చిన కృతజ్ఞతతో నెదర్లాండ్‌కి స్వీట్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన పాక్

November 7, 2022

Pakistan gave a sweet return gift to the Netherlands

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లీగ్ మ్యాచులు సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచింది. ఎప్పుడు, ఎవరు, ఎవరిపై గెలుస్తారో అంచనాలకు అందకుండా సాగింది. బలమైన జట్లు చిన్న జట్లపై అనూహ్యంగా ఓటమిని చవి చూశాయి. సెమీఫైనల్‌కి వెళ్తాయనుకున్న దక్షిణాఫ్రికా, ఆసీస్ జట్లు ఇంటి ముఖం పట్టాయి. వీరి దారిలోనే పాకిస్తాన్ కూడా బ్యాగులు సర్దేసుకుంది కానీ, అనుకోకుండా నెదర్లాండ్ వంటి పసికూన సౌతాఫ్రికాపై సంచలన విజయం సాధించడంతో సెమీస్‌కి చేరింది.

ఇప్పుడు జింబాబ్వే చేతిలో ఎదురైన ఓటమికి సెమీస్ మ్యాచులో గెలిచి ఫైనల్ చేరి అభిమానులను శాంతపరచాలని భావిస్తోంది. అయితే నెదర్లాండ్ గెలవకపోతే పాక్ జట్టు అవమానకర రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చేది. దాన్ని తప్పించిన నెదర్లాండ్ జట్టుకు కృతజ్ఞతగా పాక్ ఓ స్వీట్ రిటర్న్ గిఫ్ట్‌ను అందించింది. అదేంటంటే.. పాకిస్తాన్ బంగ్లాను ఓడించడం ద్వారా వచ్చే ప్రపంచకప్‌లో నెదర్లాండ్ జట్టు పెద్ద జట్ల మాదిరి నేరుగా పాల్గొనే అర్హత సంపాదించింది. ఒకవేళ బంగ్లాదేశ్ గెలిచి ఉంటే 6 పాయింట్లతో గ్రూపులో నిలిచేది. అప్పుడు నెదర్లాండ్ వరల్డ్ కప్ కోసం క్వాలిఫై మ్యాచులు ఆడాల్సి వచ్చేది. ఇప్పుడు పాక్ బంగ్లాపై విజయంతో నేరుగా సెమీస్‌కి చేరడంతో పాటు నెదర్లాండ్ జట్టుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందనుకోవాలి.