ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్ ప్రభుత్వం ప్రజలపై మళ్లీ భారం మోపింది. పెట్రలో, డిజిల్, వంటగ్యాసు ధరలను భారీగా పెంచింది. బుధవారం రాత్రి విడుదల చేసిన ఓ ప్రకటన ప్రకారం…పాకిస్తాన్ లో లీటర్ పెట్రోలుపై 22.20పైసలు పెంచడంతో ప్రస్తుతం ధర రూ. 272కు చేరింది. ఇక డీజిల్ ధరలు కూడా హైస్పీడ్ తో దూసుకుపోతున్నాయి. తాజాగా రూ.17.20 పెంచడంతో డీజిల్ ధర రూ. 280కి చేరింది. ఇక కిరోసిన్ పై 12.90 పెంచడంతో ఇప్పుడు లీటరు కిరోసిన్ ధర రూ. 202.73 గా ఉంది. ఈ కొత్త రేట్లు బుధవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయని పాకిస్తాన్ ఆర్థికశాఖ పత్రికా ప్రకటనలో తెలిపింది.
కాగా అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF నుంచి మరిన్ని రుణాలు పొందాలన్న ఉద్దేశ్యంతో ఉన్న పాకిస్తాన్…అదే సంస్థ నుంచి ఇప్పటికే పొందిన రుణాన్ని చెల్లించేందుకు వచ్చి…కొత్త రుణం పొందేందుకు IMF విధించిన షరతులను పాటించాల్సి ఉంది. దీంతో పాకిస్తాన్ దేశంలో నిత్యావసర వస్తువులపై క్రమంగా పన్ను పెంచుకుంటూ పోతోంది.
బుధవారం పాక్ సర్కార్ పార్లమెంటులో మినీ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ప్రజలకు అవసరమైన గోధమలు, బియ్యం, పాలు, వంటి ఆహార పదార్థాలను జీఎస్టీ పరిధినుంచి మినహాయిస్తున్నట్లు తెలిపింది. దీంతో ఊపిరిపీల్చుకున్న పాకిస్తాన్ ప్రజలకు…పెట్రోలు, డిజీల్ ధరలు పెంచుతూ నెత్తిపై పిడుగు వేశారు. కాగా పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులరూపంలో 150బిలియన్ రూపాయలను వసూలు చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.