నవాజ్ షరీఫ్‌కు తల ఎత్తుకోలేని అవమానం.. - MicTv.in - Telugu News
mictv telugu

నవాజ్ షరీఫ్‌కు తల ఎత్తుకోలేని అవమానం..

February 26, 2020

Pakistan government.

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయి. మొన్నటి వరకు ఏం అధికారంలోకి వస్తాడులే అనుకున్న ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి అయ్యాడు. ఒకప్పుడు భారత్‌తో నిత్యం కయ్యానికి ‘కార్గిల్’ దువ్విన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇప్పుడు దారుణ అవమానాలు ఎదుర్కొంటున్నాడు. అతణ్ని పరారీలో ఉన్న నిందితుడిగా పాక్ మంత్రి వర్గం ప్రకటించింది. అంతేకాకుండా కఠిన నిర్ణయాలను కూడా తీసుకుంది. 

విదేశాల్లో చికిత్స చేయించుకుంటున్న షరీఫ్ తన వైద్య నివేదికలను బయటపెట్టడం లేదని, ఇస్లామాబాద్ హైకోర్టు బెయిల్ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికిగాను మాజీ ప్రధాని హోదాలో అతనికి ప్రభుత్వం నుంచి అందే సదుపాయాలను 4 నెలల పాటు రద్దు చేసింది. గ్యాస్‌, విద్యుత్‌ వంటివి ఆయన ఇంటికి అందవు. అవినీతి కేసులో జైలుపాలైన షరీఫ్‌కు మెరుగైన వైద్యం చేయించుకోడానికి వీలుగా గత ఏడాది అక్టోబర్ మాసంలో హైకోర్టు బెయిలిచ్చింది. లండన్ వెళ్లిపోయిన ఆయన అక్కడేవో ‘రాజకీయ పావులు’ కదుపుతున్నట్లు ప్రభుత్వం అనుమానిస్తోంది!