ఆరోగ్యమంత్రిని వదలని కరోనా.. పాకిస్తాన్‌లో టెన్షన్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆరోగ్యమంత్రిని వదలని కరోనా.. పాకిస్తాన్‌లో టెన్షన్

July 7, 2020

mhmkgvhm

కరోనా సామాన్యులను నుంచి సెలబ్రెటీల వరకు ఎవరినీ వదలడం లేదు. ప్రజా ప్రతినిధులు కూడా చాలా మంది వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా పాకిస్తాన్‌లో ఏకంగా ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ జాఫర్‌ మీర్జాకు పాజిటివ్ అని తేలింది. ఇటీవల తనకు స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయగా వ్యాధి బయటపడింది. దీంతో ఆయన సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లారు. కొంత కాలం తాను ఎవరితో కలవబోనని తెలిపారు. ఈ సంఘటన స్థానికుల్లోనూ టెన్షన్ రేపింది. ఏకంగా మంత్రి ఇలా వ్యాధికి గురైతే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.  

జాఫర్‌ మీర్జా తరుచూ కరోనా వైద్యసేవలకు సంబంధించిన పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు కూడా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. కాగా జాఫర్ మీర్జా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య సేవల్లో ప్రత్యేక సహాయకుడిగా కూడా పని చేస్తున్నారు. ఇప్పటి వరకు పాక్‌లో మొత్తం 231,818 మందిలో వ్యాధి లక్షణాలు గుర్తించారు. ,762 మంది బాధితులు ప్రాణాలు కోల్పోగా.. 131,649 మంది కోలుకున్నారు.