Home > Featured > పాక్ హైకమిషన్‌లో గూఢచారులు.. మర్యాదగా వెళ్లగొట్టిన భారత్ 

పాక్ హైకమిషన్‌లో గూఢచారులు.. మర్యాదగా వెళ్లగొట్టిన భారత్ 

Pakistan High Commission Officials Spying

భారత్‌లో గూఢచర్యం జరిపేందుకు దాయాది దేశం పాకిస్తాన్ పన్నాగం పన్నింది. ఢిల్లీలోని ఆ దేశ హైకమిషన్‌ను ఆధారంగా చేసుకొని ఉన్న కొంత మంది గూఢచారులను అధికారులు గుర్తించారు. ఆర్మీ ఇంటెలిజెన్స్, ఢిల్లీ పోలీసులు కలిసి జరిపిన ఆపరేషన్‌లో వారంతా రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. వారు కీలక సమాచారాన్నిపాక్‌కు చేరేవేసేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నారు. వెంటనే భారత్ విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. గూఢచర్యానికి పాల్పడుతున్న వారిని అబిద్ హుస్సేన్, తహీర్ ఖాన్‌,జావేద్ హుస్సేన్‌గా వెల్లడించారు.

డిసెంబర్ 2018 నుంచి హైకమిషన్‌లో వీసా అసిస్టెంట్‌గా అబిద్ హుస్సేన్ పని చేస్తున్నాడు. తాహిర్ ఖాన్,జావేద్ హుస్సేన్ అప్పర్ డివిజన్ క్లర్క్‌గా గత ఐదున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. ఢిల్లీ కరోల్‌బాగ్‌లోని ఆర్య సమాజ్ రోడ్ సమీపంలో రక్షణ సిబ్బందిని కలవడానికి ప్రయత్నించినట్టుగా వెల్లడించారు. నకిలీ భారతీయ పేర్లు, గుర్తింపు కార్డులను ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. వీరంతా నగరంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ కీలక సమాచారం సేకరించినట్టుగా ఐబీ గుర్తించింది. వారి వద్ద కొన్ని కీలక పత్రాలతో పాటు రూ .15 వేల నగదు,రెండు ఐఫోన్‌ల స్వాధీనం చేసుకున్నారు. గూఢచర్యం రాకెట్‌లో హైకమిషన్‌కు చెందిన ఇతర సిబ్బందికి కూడా ఏమైనా హస్తం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

దౌత్య మిషన్‌లోని సభ్యులు గూఢచర్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరూ ఇలాంటి చర్యల్లో పాల్గొనకూడదని హెచ్చరించింది. అయితే భారత్‌లో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో పాల్గొనకూడదని, భారత్ వాదనను పాకిస్థాన్ తోసిపుచ్చింది. అవన్నీ నిరాధారమైన ఆరోపణలని కొట్టిపారేసింది. ఈ చర్య ద్వారా భారత్ వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని మండిపడింది.
కాగా 2016 తర్వాత హై కమిషన్ సభ్యులను గూఢచారులుగా పరిగణించి భారత్ వారిపై నిషేధం విధించడం ఇదే తొలిసారి భారత్-పాక్ సరిహద్దులో సైన్యం గురించి కీలక సమాచారం సేకరిస్తున్న మెహమూద్ అక్తర్ అనే వ్యక్తిని అప్పట్లో బహిష్కరించారు.

Updated : 1 Jun 2020 1:04 AM GMT
Tags:    
Next Story
Share it
Top