Home > Featured > పాక్‌లో ఘోరాలు.. హిందూ మెడికో హత్య, ఆలయాల ధ్వంసం

పాక్‌లో ఘోరాలు.. హిందూ మెడికో హత్య, ఆలయాల ధ్వంసం

Pakistan hindu...

పాకిస్తాన్‌లో మైనారిటీలపై దాడులు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పరాయి దేశంలోని కశ్మీరీలపై చూపుతున్న శ్రద్ధ సొంత దేశంలోని మైనారిటీలపై చూపడం లేదు. భారత ప్రభుత్వం ముస్లిం మైనారిటీలను అణచేస్తోందని వాపోతున్న ఆయన తమ దేశంలోని మైనారిటీల భద్రతపై మాత్రం పెదవి విప్పడం లేదు. పాక్‌లో తాజా రెండు దురాగాతాలు అక్కడి హిందువుల్లో తీవ్ర భయాందోళనలు సృష్టిస్తున్నాయి.

లోక్కానా నగరంలో వైద్యవిద్య అభ్యసిస్తున్న నమ్రితా చందానీ అనే యువతి సోమవారం హత్యకు గురైంది. ఆమెను మంచానికి తాళ్లతో కట్టేసి చంపేశారు. బీబీ ఆసిఫా డెంటల్ కాలేజీలో చదువుతున్న నమ్రిత మెడపై కేబుల్ వైర్లతో బిగించిన ఆనవాళ్లు ఉన్నాయి. తన సోదరిని చంపేశారని, మైనారిటీ వర్గానికి చెందిన వాళ్లం కాబట్టే ఇలా చేశారని నమ్రిత సోదరుడు ఆరోపించారు.

మరోపక్క.. సింధ్ రాష్ట్రోంని ఘోట్కీ ప్రాంతంలో హిందూమతానికి చెందిన నూతన్ మల్ అనే ప్రధానోపాధ్యాయుడిపై దుండగులు దాడి చేశారు. అతడు మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఇనుపరాడ్లతో కొట్టి హింసించారు. దీంతో ఆ ప్రాంతంలో అల్లర్లు చోటుచేసుకున్నాయి. స్కూలుతోపాటు మూడు హిందూ ఆలయాలను ధ్వంసం చేశారు. నూతన్ ఎలాంటి తప్పూ చేయలేదని, ఇస్లాం ఛాందసవాదులు ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని హిందువులు అంటున్నారు.

Updated : 17 Sep 2019 7:51 AM GMT
Tags:    
Next Story
Share it
Top