పాకిస్తాన్లోని మైనారిటీలకు రక్షణ పూర్తిగా కరువైంది. ఓ హిందూ మహిళలపై దుండుగులు ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘోరాన్ని తలపించేలా దారుణ అఘాయిత్యానికి పాల్పాడ్డాడు. అత్యాచారం చేసి, శరీరాన్ని ఛిద్రం చేశారు. దీనిపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మైనారిటీలను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే అని తేల్చిచెప్పింది. సింధ్ రాష్ట్రంలోని సంజోరో పట్టణానికి చెందిన దయా భేల్ అనే 40 ఏళ్ల హిందూ వితంతువును దుండగులు బలితీసుకున్నారు. ఆమె శవం బుధవారం పొలంలో గుర్తుపట్టలేని స్థితిలో కనిపించింది. ఆమె తలను నరికేసి, రొమ్ములు కోసి, చర్మం వలిచారు. భారత ప్రభుత్వం ఈ సంఘటనపై మండిపడుతూ, మైనారిటీల బాగోగులపై శ్రద్ద పెట్టాలని పాక్ సర్కారుకు తలంటింది. పాకిస్తాన్లో మైనారిటీలపై తరచూ దాడులు జరుగుతున్నాయి. వారి ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు.