ఇమ్రాన్ కాపురాన్ని కూల్చిన కుక్కలు - MicTv.in - Telugu News
mictv telugu

ఇమ్రాన్ కాపురాన్ని కూల్చిన కుక్కలు

April 25, 2018

పాకిస్తాన్ మాజీ క్రికెటర్, తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ మూడో పెళ్లీ పెటాకులైంది. మూడు నెలల కిందటే ఆధ్యాత్మిక సలహాదారు బుష్రా మనీకాను పెళ్లిచేసుకున్న ఇమ్రాన్ కాపురం కూలిపోయింది. బుష్రా ‘గృహహింస’ భరించలేక పుట్టింటికి వెళ్లిపోయింది. వీరిద్దరూ ఇక విడిపోయినట్టేనని, రేపోమాపో విడాకులు తీసుకుంటారని పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

కుక్కలు, కొడుకు..  

ఇమ్రాన్ తాజా పెళ్లిబంధం తెగిపోవడానికి కుక్కలు, ఇంటిగొడవలు కారణమని తెలుస్తోంది. బుష్రా మనీకా కొడుకూ కారణం అని కథనాలు వస్తున్నాయి. ఇమ్రాన్ ఇంట్లో చాలా పెంపుడు కుక్కలు ఉన్నాయి. వాటి వల్ల తన ప్రార్థనలకు ఇతర మతకార్యకలాపాలకు ఇబ్బంది కలుగుతోందని మనీకా చెప్పడంతో నౌకర్లు వాటిని వెళ్లగొట్టారు. అయితే అవి మళ్లీ తిరిగొచ్చాయి. ఇమ్రాన్ కూడా వాటిని ముద్దు చూసుకుండడంతో మనీకాకు కోపమొచ్చింది. మరోపక్క.. మనీకా కొడుకు తమ ఇంట్లో ఉండడం ఇమ్రాన్‌కు సుతరామూ ఇష్టం లేదు. పైగా ఆమె బంధువులు క్యూ కట్టడంతో అతనికి మరింత కోపమొచ్చింది. దీంతో ఎందుకొచ్చిన కలహాల కాపురం, విడిపోతే బెటర్ అని అనుకున్నారట. మనీకాకు.. ఖవర్ ఫరీద్ అనే వ్యక్తితో ఇదివరకు పెళ్లయి కొడుకు ఉన్నాడు. ఆమెను ఇమ్రాన్ పెళ్లిచేసుకోవడం అతని చెల్లెళ్లకు ఏమాత్రం ఇష్టం లేదు.