మోదీ ఇలాకాలో ఐఎస్ఐ ఉగ్రవాది తిరుగుళ్లు  - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ ఇలాకాలో ఐఎస్ఐ ఉగ్రవాది తిరుగుళ్లు 

January 20, 2020

hb n

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గమైన వారణాసీలో ఉగ్ర కదలికలు కలవరం సృష్టిస్తున్నాయి. పాకిస్థాన్‌కు చెందిన ఓ ఐఎస్ఐ ఏజెంటును పోలీసులకు చిక్కాడు. భారత సైన్యానికి సంబంధించిన కీలక సమాచారాన్ని రషీద్ అహ్మద్ అనే వ్యక్తి ISIకి చేరవేస్తున్నట్టు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని ఉగ్రకుట్రకు సంబంధించిన పూర్తి వివరాలపై  యాంటీ టెర్రర్ స్క్వాడ్ ప్రశ్నిస్తోంది. 

రషీద్ అహ్మద్ చిట్టూపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా భద్రతా బలగాలు గుర్తించాయి. ఆర్మీ బేస్ లకు చెందిన ఫోటోలు, వీడియోలను తీసి ఆ సమాచారాన్ని ఉగ్రవాద సంస్థకు చేరవేస్తున్నట్టుగా సమాచారం అందడంతో పక్కా ప్లాన్‌తో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రషీద్ ఇప్పటికే రెండు సార్లు పాకిస్తాన్‌ వెళ్లి  ISI ఏజెంట్లను కలిసి వచ్చినట్టుగా దర్యాప్తులో వెల్లడైంది. నిత్యం భక్తుల రద్దీతో ఉంటే ప్రాంతంతో పాటు ప్రధాని సొంత నియోజకవర్గంలో ఇలాంటి కదలికలు కలవరం సృష్టిస్తున్నాయి. వెంటనే అధికారులు అప్రమత్తమై భద్రతను కట్టుదిట్టం చేశారు.