భారత దౌత్యవేత్తను వెంబడించిన పాక్ ఐఎస్ఐ ( వీడియో ) - MicTv.in - Telugu News
mictv telugu

భారత దౌత్యవేత్తను వెంబడించిన పాక్ ఐఎస్ఐ ( వీడియో )

June 5, 2020

Pakistan ISI Chased Indian Embassy Officer

పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. ఏకంగా ఆ దేశంలో ఉన్న భారత దౌత్యవేత్తను భయపెట్టాలని ప్రయత్నించింది. దీని కోసం ఐఎస్ఐకి చెందిన ఓ వక్తిని రంగంలోకి దింపింది. అతడు బైక్‌పై భారత హై కమిషన్‌లో పని చేసే దౌత్యవేత్త గౌరవ్ అహ్లూవాలి కారును వెంబడించాడు. ఓ దశలో అతన్ని భయపెట్టేలా సైగలు చేస్తూ రెచ్చిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోను దౌత్యకార్యాలయం విడుదల చేయడంతో అది వైరల్ అయ్యింది. దీంతో పాక్ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు భారత నెటిజన్లు. 

ఇస్లామాబాద్‌లో గౌరవ్ నివాసం బయట ఓ వ్యక్తి చాలా సేపటి నుంచి వేచి  ఉన్నాడు. ఆయన కారులో బయటకు రాగానే వెంటనే అతడు  బైక్‌పై వెంబడించాడు. కాగా ఇటీవల గూఢచర్యానికి పాల్పడుతున్నారంటూ ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు అధికారులను భారత్ బహిష్కరించింది. గూఢచర్యం చేస్తూ ఇద్దరు అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. దీంతో భారత్‌పై దాయాది దేశం ప్రతికార చర్యలకు సిద్ధమైంది. దీంట్లో భాగంగానే బెదిరింపులకు దిగుతోంది. భారత అధికారులను కూడా అక్కడి నుంచి బహిష్కరించే అవకాశం ఉందని స్థానిక మీడియా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది.