కశ్మీర్ పాకిస్తాన్‌దా?అని నవ్విన పాకిస్తానీపై దాడి - MicTv.in - Telugu News
mictv telugu

కశ్మీర్ పాకిస్తాన్‌దా?అని నవ్విన పాకిస్తానీపై దాడి

August 12, 2020

Pakistan lahore citizen meme on kashmir map fancy .

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను గేలిచేసినందుకు ఆ దేశ పౌరుడిపై దుండగులు దాడి చేశారు. భారత్‌లో అంతర్భాగమైన జమ్మూకశ్మీర్‌ను తనదిగా చూపుకుంటూ పాకిస్తాన్ ప్రభుత్వం తయారు చేసిన అడ్డుగోలు మ్యాపును ఇమ్రాన్ ఖాన్ ఆమోదించగం తెలిసిందే. దీనిపై భారత్‌తోపాటు పాకిస్తాన్‌లోనూ నవ్వులు విరబూస్తున్నాయి.  

లాహోర్‌కు చెందిన ఓ వ్యక్తి కశ్మీర్ విషయంలో ఇమ్రాన్ తీరును గేలి చేస్తూ టిక్ టాక్‌లో వీడియో పోస్ట్ చేశాడు. దీన్ని చూసిన కొందరు అతనిపై తీవ్రంగ దాడి చేశారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అతణ్ని అరెస్ట్ చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రధానమంత్రి తప్పుబడితే అరెస్ట్ చేస్తారా అంటూ విపక్షాలు గుర్రుమంటున్నాయి. కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేయడాన్ని ఇమ్రాన్ ఖాన్ జీర్ణించుకోవడం లేదు. కశ్మీరీలు తమవాళ్లను, వాళ్లకు స్వాతంత్ర్యపోరాటంలో సాయం చేస్తామని చెప్పుకొస్తున్నాడు.