పాకిస్తాన్ దేశంలో గురువారం సాయంత్రం ఓ సంఘటన చోటుచేసుకుంది. జంషోరోకు సమీపంలోని ఆలియాబాద్‌లో గుర్తు తెలియని ఓ వస్తువు పొగలు కక్కుతూ నేలకూలింది. అయితే, దానిని మొదటగా ఓ వస్తువుగా అక్కడి ప్రజలు గుర్తించారు. కానీ అది వస్తువు కాదని ‘క్షిపణి’ అని పలువురు అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం భారత్ క్షిపణి ఒకటి పొరపాటున వెళ్లి, పాకిస్తాన్ భూభాగంలో పడిన సంగతి తెలిసిందే. దీనిపై పాకిస్తాన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. అది పొరపాటున జరిగిందని భారత్ కూడా విచారాన్ని వ్యక్తం చేసింది. అయితే, పాకిస్తాన్ ఇప్పుడు దానికి పోటీగా ఓ క్షిపణిని ప్రయోగించి నవ్వుల పాలైందని ఆ దేశపు మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
🚨: A failed interception attempt by pak SAM..Fell short after launch #Jamshoro pic.twitter.com/7sjuUSl2Xr
— Cosmic Joke 🔱 (@CosmicJoke101) March 17, 2022
వివరాల్లోకి వెళ్తే.. పాకిస్తాన్‌లోని సింధ్ రాష్ట్రంలో ఉన్న జంషోరోకు సమీపంలోని ఆలియాబాద్‌లో ఓ గుర్తు తెలియని వస్తువు పొగలు కక్కుకుంటూ నేలకూలింది. అయితే ఆకాశంలో ఆ క్షిపణి పొగలు కక్కుతూ వస్తుండడాన్ని కొందరు వ్యక్తులు వీడియో తీశారు. దానిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో తెగ వైరల్ అవుతుంది.
ఈ ఘటనపై పాకిస్తాన్ ప్రభుత్వం స్పందిస్తూ..”కొన్ని మీడియా సంస్థలు దీనిపై కావాలనే కథనాలను రాస్తున్నారు. భారత్ నుంచి మిస్ ఫైర్ అయిన మిసైల్‌కు పోటీగా పాకిస్తాన్ కావాలనే ఇప్పుడు క్షిపణి ప్రయోగం చేసి ఉంటుందని, అదికాస్తా మిస్ ఫైర్ అయిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై పాకిస్తాన్ రక్షణ శాఖ విశ్లేషకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, లేనిపోని కథనాలు వస్తున్నాయని మండిపడ్డారు. క్షిపణి రేంజ్ తెలుసుకునేందుకు బలగాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. దానికి సంబంధించి ముందు జాగ్రత్త చర్యలను జారీ చేశామని అన్నారు.