Pakistan Man host For Indian Visitors
mictv telugu

భారతీయులకు బిర్యానీ పెట్టిన పాకిస్తానీ… వీడియో వైరల్

November 9, 2022

Pakistan Man host  For Indian Visitors

ద్వేషం మట్టిమయమైన దేశాల మధ్యే తప్ప మనుషుల ఉండదు. రాజకీయాలు వేరు మనుషులు వేరు. సాటి మనిషితో సంతోషంగా కలసిమెలి ఉండాలని కోరుకునే మనుషులే ఎక్కువ ఈ లోకంలో. పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటే ఈ లోకంలో మనుషులే ఉండేవాళ్లు కాదు. పాకిస్తాన్, భారత్ మధ్య ఏ గడ్డీ వేయకున్న భగ్గున మండే నేటి పరిస్థితిలో ఓ పాకిస్తానీ చేసిన పనికి జనం ఫిదా అవుతున్నారు. తమ దేశానికి ఏదో పనిపై వచ్చిన భారతీయులతో కనీస పరిచయం లేకపోయినా కారులో లిఫ్టు ఇవ్వడమే కాకుండా, తన ఆఫీసుకు తీసుకెళ్లి మరీ హైదరాబాద్ బిర్యానీ తినిపించాడు. ఈ వార్త, వీడియో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి.

ఇస్లామాబాద్‌లో జరుగుతున్న టెన్నిస్ మ్యాచ్‌లో ఆడడానికి హైదరాబాద్‌కు చెందిన ఓ బాలిక కుటుంబంతోపాటు వెళ్లింది. తాహిర్ ఖాన్ అనే స్థానికుడు వాళ్లను చూసి ఆప్యాయంగా పలకరించారు. వాళ్లను కారులో తన ఆఫీసుకు తీసుకెళ్లి హైదరాబాదీ బిర్యానీ పెట్టించాడు. ‘‘మాకు మీ విరాట్ కోహ్లీని ఇచ్చే టీ20 కప్పు మీరు పట్టుకెళ్లండి’ అని తాహిర్ సరదాగా అన్నాడు. పాకిస్తాన్‌లో తమకు ఇంత ప్రేమపూర్వక ఆతిథ్యం దక్కుతుందని అసలు ఊహించలేదని బాలిక చెప్పింది. తాహిర్ ఆతిథ్యంపై నుటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పాకిస్తాన్‌లో మైనారిటీ హిందువులపై దాడులు ఎంత నిజమో అలాంటి మంచి మనుషులు ఉన్న మాట కూడా అంతే నిజమని అంటున్నారు.