pakistan match fixing allegations on team india going viral in social media
mictv telugu

షాకింగ్.. తెరపైకి ఫిక్సింగ్ ఆరోపణలు.. భారత్ పై పాకిస్తాన్ మరో కుట్ర

October 31, 2022

భారత్ అంటేనే ఏడ్చి చచ్చే పాకిస్తాన్ ఇప్పుడు మరో కుట్రకి తెరలేపింది. నిన్న జరిగిన హోరాహోరీ పోరులో సౌత్ ఆఫ్రికాతో పోరాడి ఓడింది భారత్. అయితే సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్ లో కొన్ని ఫీల్డింగ్ తప్పిదాలతో మ్యాచ్ ని కోల్పోయింది భారత్. కోహ్లీ క్యాచ్ మిస్ చేయటం, రోహిత్ శర్మ సునాయాస రనౌట్ చేయకపోవటం, ఇక కీలక సమయంలో అశ్విన్ భారీగా పరుగులు ఇవ్వటంతో సౌత్ ఆఫ్రికా థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. అయితే ఒత్తిడిలో జరిగే సహజ తప్పిదాలని ఫిక్సింగ్ అంటూ కొత్త కుట్రకి పాకిస్తాన్ తెరలేపింది. భారత్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడిందని పాకిస్థాన్‌ క్రికెట్‌ అభిమానులు ఆరోపిస్తున్నారు. సులువైన రనౌట్లు, క్యాచ్‌లను కావాలనే మిస్‌ చేసి సౌతాఫ్రికాను గెలిపించారని విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మలపై ఆరోపణలు గుప్పిస్తుంది పాకిస్తాన్. వరల్డ్ బెస్ట్ ఫీల్డర్ అయిన కోహ్లీ.. ఈజీ క్యాచ్‌ను వదిలేయడంపై పాక్‌ ఫ్యాన్స్‌ అవాక్కవుతున్నారు.

ఇక పాకిస్తాన్ ఫిక్సింగ్ ఆరోపణలకు బలమైన కారణం ఉంది. సౌత్ ఆఫ్రికాతో భారత్ గెలవాలని మనకంటే ఎక్కువగా కోరుకున్నారు పాకిస్తాన్ ఫాన్స్. సౌత్ ఆఫ్రికా గెలుస్తే తనకు సెమీస్ అవకాశాలు దాదాపు ఉండవని.. అందుకే ఎలాగైనా నిన్నటి మ్యాచ్ లో భారత్ గెలవాలని ప్రార్థనలు చేశారు పాకిస్తానీలు. అయితే ఆఖరి వరకు ఇండియానే విజయం సాదిస్తుందని సంబరాల్లో మునిగి తేలిన పాక్ ఫ్యాన్స్ కి షాక్ తగిలింది. సౌత్ ఆఫ్రికా చేతిలో అనూహ్యంగా టీమిండియా ఓడిపోవటంతో తట్టుకోలేకపోతున్నారు పాక్ ఫాన్స్. పాక్ సెమీస్ చేరవద్దనే ఉద్దేశంలోనే భారత్ కావాలనే మ్యాచ్ ఓడిపోయిందని అభిమానులతో పాటు కొందరు పాకిస్తాన్ మాజీలు సైతం కామెంట్స్ చేస్తుండటం మరీ కామెడీ. ఇక మొత్తంగా పాక్ ఆరోపణలతో ఇప్పుడు భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ పై ఫిక్సింగ్ నీలినీడలు కమ్ముకున్నాయి. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.