భారత్‌‌కు మద్దతిచ్చే దేశాలపై బాంబులేస్తాం: పాక్ మంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌‌కు మద్దతిచ్చే దేశాలపై బాంబులేస్తాం: పాక్ మంత్రి

October 30, 2019

Pakistan Minister..

భారత్‌పై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్న పాకిస్తాన్ నేతలు మరోసారి తమ కుటిల బుద్దిని బయటపెట్టుకున్నారు. జమ్మూ కశ్మీర్ విషయంలో భారత్‌కు మద్దతు ఇచ్చే దేశాలపై దాడులు చేస్తామంటూ ఆ దేశ మంత్రి అలీ అమీన్‌ఖాన్ హెచ్చరించారు.కశ్మీర్ విషయంలో రెండు దేశాల మధ్య వివాదం ముదిరితే భారత్‌తో యుద్ధం చేయడానికి వెనకాడబోమని స్పష్టం చేశారు.పొరుగు దేశాలు భారత్‌కు సహకరిస్తే వారిపై కూడా మిస్సైల్ దాడులు చేస్తామంటూ హెచ్చరించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. 

ఇప్పటికే ఆర్టీకల్ 370 రద్దు తర్వాత నుంచి పాకిస్తాన్ రాజకీయ నేతలు భారత్‌పై విషం చిమ్ముతూనే ఉన్నారు. గతంలో అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టాలని ప్రయత్నించి భంగపడ్డారు. అయినా మారకుండా మరోసారి దాడులకు సిద్ధం అంటూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే కశ్మీర్ అంశం రెండు దేశాల మధ్య అంతర్గత విషయమని ప్రపంచ దేశాలు వ్యాఖ్యానిస్తున్నాయి. గతంలోనూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అయితే తాజాగా పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఇంకా భారత్ ఎటువంటి కామెంట్ చేయలేదు.