అంత తొందరెందుకు? సంతోషాన్ని చెడగొడతారా?: అయోధ్య తీర్పుపై పాక్ - MicTv.in - Telugu News
mictv telugu

అంత తొందరెందుకు? సంతోషాన్ని చెడగొడతారా?: అయోధ్య తీర్పుపై పాక్

November 9, 2019

అయోధ్య తీర్పుపై పాకిస్తాన్ కూడా స్పందించింది. భారత సుప్రీం కోర్టు ఏం కొంప మునిగిపోయిందని హడావుడిగా తీర్పు చెప్పిందని మండిపడింది. కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభ శుభ సమయంలో ఈ తీర్పు ఇచ్చి ప్రజల సంతోషాన్ని చెడగొట్టారని పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ చెప్పుకొచ్చారు.  

‘చాలా సున్నితమైన కేసులో తీర్పును వెలువరించడానికి సుప్రీం కోర్టు ఇంకొన్ని రోజులు ఎందుకు ఆగలేకపోయింది?  కీలకమైన తీర్పు వెల్లడికి ఇది సరైన సమయం కాదు. కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభం రోజునే ఈ తీర్పు ఇవ్వడం వల్ల ఆ ప్రారంభానికి ప్రాధాన్యత పోయింది. భారత్ ఉద్దేశపూర్వకంగా ఇలా చేయడం విచారం కలిగిస్తోంది. తీర్పు కోసం ఇన్నేళ్లు ఎదురు చూసిన దేశం ఇంకొన్ని రోజులు ఆగలేదా? భారత్‌లో ఆందోళనకు గురవుతున్న ముస్లింలు ఈ తీర్పుతో మరింత ఒత్తిడికి గురవుతారు… అని అన్నారు. 

Pakistan minister.

భారత్‌పై విద్వేష వ్యాఖ్యలకు చిరునామా అయిన పాక్ సామాచార మంత్రి, ఫవాద్ హుస్సేన్ కూడా తీర్పుపై స్పందించారు. భారత సుప్రీం కోర్టు ఈ కేసులో సుప్రీంకోర్టు స్వతంత్రంగా వ్యవహరించలేదని ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్లతో వచ్చిన ఈ తీర్పు చట్టవిరుద్ధమన్నారు.