Pakistan Movie The Legend of Maula Jatt beats RRR UK Records
mictv telugu

‘ఆర్ఆర్ఆర్’ రికార్డ్స్ ని.. ఈ పాకిస్తాన్ ముష్టి సినిమా క్రాస్ చేసిందా.. ఇది మేము నమ్మాలా ?

November 5, 2022

పాకిస్థానీ స్టార్ హీరో ఫవాద్ ఖాన్ నటించిన ‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్’ చిత్రం UKలో విడుదలైన 17 రోజులలో రాజమౌళి RRR మూవీ కలెక్షన్స్ ని క్రాస్ చేసిందని పాకిస్తాన్ సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. 1979లో బిలాల్ లాషారి దర్శకత్వంలో పంజాబీ భాషలో విడుదలైన ‘మౌలా జట్ యూనస్ మాలిక్’ అనే కల్ట్ క్లాసిక్‌కి ‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్’ రీమేక్. అయితే ఈ రీమేక్ సినిమా ట్రిపులార్ ని బీట్ చేసేసిందని అంటున్నారు పాకిస్తాన్ నెటిజన్స్. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా బ్రిటన్ లో రూ.100 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మరోవైపు ‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్’ సినిమా పాకిస్తానీ కరెన్సీలో ఇప్పటి వరకు 150 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ అఫిషియల్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. వరల్డ్ వైడ్ గా 150 కోట్లు రాబట్టిన పాకిస్థానీ సినిమా.. RRR చిత్రాన్ని బీట్ చేయడం అంటే.. ఒక్క బ్రిటన్ లోనే 100 కోట్లకు పైగా రాబట్టినట్లు అర్థం. దీన్ని బట్టే పాకిస్తాన్ మీడియా ‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్’ వసూళ్లను ఫేక్ చేస్తోందని చెప్పొచ్చు.

ఇక ప్రపంచ వ్యాప్తంగా 1200కోట్లు కలెక్ట్ చేసిన ‘ఆర్.ఆర్.ఆర్’ తాజాగా జపాన్ లో సైతం విడుదలైంది. అక్కడ మొదటి షో నుండే హిట్ టాక్ తెచ్చుకుని.. జపాన్ లో విడుదలైన టాప్ 5 ఇండియన్ మూవీస్ లో నిలిచి రికార్డ్ సృష్టించింది. అయితే ఇంకొన్ని రోజులు ఆడితే జపాన్ లో టాప్ వన్ లో ఉన్న రజినికాంత్ ముత్తు సినిమాని కూడా క్రాస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ పై హాలీవుడ్ మేకర్స్ సైతం ప్రశంసలు కురిపించారు. ప్రత్యేక క్యాటగిరిలో ఆస్కార్ కి సైతం నామినేట్ కానుంది ఆర్ఆర్ఆర్. ఇన్ని గొప్పలున్న ఆర్ఆర్ఆర్ తో పోల్చుకుంటే తమ సినిమా స్థాయి పెరుగుతుందనే దురాలోచన తప్ప పాకిస్తానీ నెటిజన్స్ లెక్కల్లో నిజం లేదంటున్నారు బాలీవుడ్ క్రిటిక్స్. పాకిస్తాన్ లో కేవలం 50కోట్లు వసూల్ చేసిన ఈ ‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్’ బ్రిటన్ లో 100కోట్ల లెక్క తప్పు అంటున్నారు. అయితే ఈ 100కోట్ల లెక్కలు కూడా మన అంచనాలే. ఇంతవరకు ఎక్కడ ‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్’ చిత్ర యూనిట్ అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు బయటపెట్టలేదు. కావాలని ఫేక్ కలెక్షన్స్ చూపెడుతున్నారు. ‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్’ చిత్రం క్వాలిటీ, మన హిందీ సీరియల్స్ కంటే వరెస్ట్ అని.. మన వెబ్ సిరీస్ కి పెట్టె బడ్జెట్ అంత కలెక్షన్స్ కూడా వచ్చి ఉండవని పాకిస్తాన్ నెటిజన్స్ కామెంట్స్ కి సోషల్ మీడియాలో ఇండియన్స్ కౌంటర్ అటాక్ ఇస్తున్నారు.