పాకిస్థాన్ లో ఏం జరుగుతుంది..? - MicTv.in - Telugu News
mictv telugu

పాకిస్థాన్ లో ఏం జరుగుతుంది..?

July 29, 2017

ప్రస్తుతం పాకిస్థాన్ లో ఏం జరుగుతుంది?పాకిస్థాన్  రాజకీయాలు పూర్తిగా ఉగ్రవాదుల చేతిలోకి వెళ్లబోతున్నాయా?నవాజ్ షరిఫ్ తర్వాత ప్రధానమంత్రి కుర్చీ ఎక్కేది ఎవరు?

కుంభకోణం,భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినందుకు..పాకిస్ధాన్ ప్రధానమంత్రి  నవాజ్ షరీఫ్ పదవి ఊడింది.మ‌రో ఏడాది అయితే ఆయ‌న ప‌ద‌వీకాలం ముగిసేది. అంతేకాదు పాకిస్థాన్‌కు తొలిసారి ఐదేళ్లు ప్ర‌ధానిగా ఉన్న ఘ‌న‌త కూడా ద‌క్కేది. కానీ సుప్రీంకోర్టు అనర్హ‌త వేటుతో దిగిపోక త‌ప్ప‌లేదు.ఇప్పుడు కొత్త ప్ర‌ధాని ఎవ‌రు అన్న‌ది స‌స్పెన్స్‌గా మారింది.ష‌రీఫ్ త‌మ్ముడు షాబాజ్ ష‌రీఫ్ పేరు తెర‌పైకి వ‌స్తున్న‌ది. కొన్నివారాల పాటు మ‌ధ్యంత‌ర ప్ర‌ధానిని నియ‌మించి.. త‌ర్వాత షాబాజ్‌ను తీసుకురావ‌చ్చ‌ని స్థానిక మీడియా వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం షాబాజ్‌..పంజాబ్ ప్రావిన్స్ ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. ఆయ‌న సీఎం ప‌ద‌వికి రాజీనామా చేసి నేష‌న‌ల్ అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉంటుంది. మంచి తెలివైన నేత‌గా షాబాజ్‌కు పేరున్నా.. న‌వాజ్ ష‌రీఫ్ అంత మాస్ ఫాలోయింగ్ ఆయ‌న‌కు లేదు.

ఒక జిహాది ప్రధానమంత్రి అవుతాడా?

నవాజ్‌ షరీఫ్ పాకిస్థాన్ ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగినందుకు జమాత్ ఉద్ దవా సెకెండ్ కమాండర్ అబ్దుల్ రహమాన్ మక్కి హర్షం వ్యక్తం చేశాడు.తాజాగా బయటపడిన ఓ వీడియోలో మక్కీ మాట్లాడుతూ పాకిస్థాన్‌కు ఓ జీహాదీ నాయకత్వం వహించాలని పిలుపునిచ్చాడు. పని ఇప్పుడే ప్రారంభమైందని, అల్లాకు ధన్యవాదాలని అన్నాడు. జీహాద్‌కు వ్యతిరేకంగా పని చేస్తూ పట్టుబడ్డావని నవాజ్ షరీఫ్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశాడు.నవాజ్ ఇస్లాంనుసమర్థించ లేదన్నాడు, పాకిస్థాన్‌లో రాజకీయ నేతలకు ఉగ్రవాద నాయకులే సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారని సమాచారం. నెమ్మదిగా పాకిస్థాన్ సైన్యం తన ప్రాబల్యాన్ని పెంచుకుంటోందని తెలుస్తోంది.సూడాలెమరి పాకిస్థాన్ రాజకీయాలు ఎంత హీట్ గా మారబోతున్నాయో అనేది.