ట్రాన్స్‌జెండర్‌పై ఐదుగురు సామూహిక అత్యాచారం..  - MicTv.in - Telugu News
mictv telugu

ట్రాన్స్‌జెండర్‌పై ఐదుగురు సామూహిక అత్యాచారం.. 

October 22, 2019

Pakistan ,

ట్రాన్స్‌జెండర్‌ను కిడ్నాప్‌ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ దారుణ ఘటన పాకిస్తాన్‌లో వెలుగుచూసింది. ఈ ఘటన సెప్టెంబర్‌ 20న కామలి నగరంలోని ధూప్‌సారి గ్రామంలో చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్‌20న కామలి నగరానికి చెందిన నలుగురు ట్రాన్స్‌జెంటర్లు ఓ ఈవెంట్‌ కోసం ధూప్‌సారి గ్రామానికి వెళ్లారు. అక్కడ కార్యక్రమం ముంగించుకుని అర్థరాత్రి 2 గంటలకు తమ స్వగ్రామాలకు బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో వారిని ఐదుగురు దుండగులు అడ్డుకున్నారు.  వారితో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ట్రాన్స్‌జెండర్లు వారిపై తిరగబడ్డారు. 

విచక్షణ కోల్పోయిన దుండగులు ఓ ట్రాన్స్‌జెండర్‌ని కిడ్నాప్‌ చేసి సమీపంలోని ఫామ్‌హౌజ్‌కి లాక్కెళ్లారు. అనంతరం ఐదుగురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మూడు గంటల పాటు ఆ ట్రాన్స్‌జెండర్‌కు నరకం చూపించారు. అనంతరం ఆమెను సహివాల్‌ నగరంలో విడిచిపెట్టి పారిపోయారు. నిస్సహాయ స్థితిలో వున్న ఆమె ఓ స్నేహితురాలి సహాయంతో ఇంటికి చేరుకున్నారు. ఈ ఘటనపై మరుసటి రోజు హరప్పా పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకోలేదు. దీంతో ఆమె సహివాల్‌ డీపీఓకు ఫిర్యాదు చేశారు. డీపీఓ సూచన మేరకు హరప్పా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నెల రోజుల తర్వాత నిందితులను అదుపులోకి తీసుకున్నారు.