ఇమ్రాన్‌కు పాక్ వ్యాపారుల మస్కా.. భారత్ నుంచి రహస్య దిగుమతులు - MicTv.in - Telugu News
mictv telugu

ఇమ్రాన్‌కు పాక్ వ్యాపారుల మస్కా.. భారత్ నుంచి రహస్య దిగుమతులు

May 13, 2020

Pakistan prime minister imran khan order inquiry on medicine imports from india

ప్రధాని నివాసంలోని బర్రెలను కూడా అమ్ముకుని, పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ప్రభుత్వానికి అక్కడి ఔషధ వ్యాపారులు షాకిచ్చారు. ప్రాణాలు కాపాడ్డానికి వాడే అత్యవసర మందుల పేరుతో భారత్ నుంచి భారీ స్థాయిలో సాధారణ ఔషధాలను భారతీ స్థాయిలో దిగుమతి చేసుకున్నారు. ఏకంగా 450 రకాల ఔషధాలను భారత్ నుంచి అక్రమంగా దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిసింది. వీటిలో విటమిన్, ప్రొటీన్ల వంటి బలవర్ధకాలు కూడా ఉన్నాయి. ఫలితంగా పాక్ ఔషధ పరిశ్రమలు భారీగా నష్టపోయే ప్రమాదముంది. 

ఈ వ్యవహారంపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా స్పందించారు. కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆదేశించారు. భారత ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేశాక పాక్ కచ్చతో వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకుంది. అయితే పాక్ ఫార్మా రంగం ఇంకా స్వయం సమృద్ధ సాధించని నేపథ్యంలో ప్రాణాధార మందులను మాత్రం భారత్ నుంచి దిగుమతి చేసుకోడానికి అంగీకరించింది. ఈ మినహాయింపును అక్కడి వ్యాపారులు అనుకూలంగా మార్చుకుని కోట్లాది విలువైన సాధారణ మందులను భారత్  నుంచి తెప్పించుకుంటున్నారు. ఇందులో కొందరు అధికారులు కీలక పాత్ర పోషించినట్లు వార్తలు వస్తున్నాయి.