పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దివాలా ప్రధాని అనే అప్రదిష్టను మోస్తున్నారు. గత ప్రభుత్వాలు చేసిన భారీ అప్పులు తీర్చలేక నానా అగచాట్లూ పడుతున్నారు. అప్పులు గండం గట్టెక్కడానికి నానా పొదుపు చర్యలూ చేపడుతున్నారు. అందులో భాగంగా ప్రధాని నివాసంలోని గేదెలను వేలం వేశారు.
8 గేదెలను గురువారం ఆయన వేలంలో తెగనమ్మి రూ.23 లక్షలు సేకరించారు. ఇందులో ఓ గేదె ఏకంగా రూ.3,85,000 భారీ ధరకు అమ్ముడు పోయింది. మిగిలిన గేదెలను ఇమ్రాన్ సొంత పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఈ–ఇన్సాఫ్(పీటీఐ) కార్యకర్తలు కొనుగోలు చేశారు.
కార్లు కూడా
అలాగే ప్రధాని నివాసంలోని వాహనాలు వేలంలో భాగంగా మొత్తం 61 విలాసవంతమైన బుల్లెట్ ప్రూఫ్ కార్లను ఇటీవల వేలానికి పెట్టారు. ఈ వేలంలో బుల్లెట్ ప్రూఫ్ కార్లు, లేటెస్ట్ మోడల్ బెంజి కార్లు, ఎనిమిది బుల్లెట్ ప్రూఫ్ బీఎండబ్ల్యూ కార్లు, 5,000 వాణిజ్య వాహనాలు, 3,000పాత మోడల్ సీసీ వాణిజ్య కార్లను ఇమ్రాన్ ఖాన్ వేలం వేశారు. ఇప్పుడు ఇంట్లోని పశువులను కూడా అమ్మాకానికి పెట్టడంతో ప్రతిపక్షాలు బగ్గుమంటున్నాయి. పొదుపు పేరుతో ఇమ్రాన్ ఖాన్ అన్నింటిని వేలం వేసి, అలా వచ్చిన డబ్బును విలాసాలకు వాడుకుంటున్నారి మండిపడుతున్నారు.