మోదీ విమానానికి నో చెప్పిన పాకిస్తాన్ - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ విమానానికి నో చెప్పిన పాకిస్తాన్

September 19, 2019

Narendra Modi ....

జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. భారత్‌ను ఎలాగైనా అడ్డుకోవాలని పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడంలేదు. దీంతో భారత్ చేసే ప్రతి పనిని అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ విమానాన్ని తమ గగనతలం మీదుగా అనుమతించలేదు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ విమానం కూడా పాకిస్థాన్ మీదుగా వెళ్లడానికి అనుమతి ఇవ్వడానికి నిరాకరించింది. 

సెప్టెంబర్ 27న ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసందే. దీంతో పాకిస్తాన్ గగనతలం మీదుగా వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని భారత అధికారులు కోరారు. అయితే తమ గగనతలం మీదుగా భారత్ ప్రధాని విమానం అనుమతించేది లేదని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ స్పష్టం చేశారు. కాగా, భారత్ నుంచి అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లే విమానాలన్నీ పాకిస్థాన్ గగనతలం మీదుగానే వెళ్తుంటాయి. భారత విమానాలను పాకిస్థాన్ నిషేధిస్తే ఆ విమానాలన్నీ అరబ్ దేశాల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.