Pakistan resumes trade with India
mictv telugu

వేరే దారి లేక భారత్‌ను ఆశ్రయించిన పాక్.. సాయం కోసం అర్ధింపు

August 29, 2022

మతోన్మాదం తలకెక్కిన పాకిస్తాన్ అవసరార్ధం ఏ రంగునైనా మార్చుకునేందుకు మరోసారి సిద్ధపడింది. గతంలో ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు మన దేశంతో వాణిజ్య లావాదేవీలపై నిషేధం విధించింది. తర్వాత కరోనా వచ్చినప్పుడు మాత్రం మన దేశం నుంచి అత్యవసర మందులు దిగుమతి చేసుకుంది. తర్వాత కథ షరా మామూలే. ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా వరదలు ముంచెత్తడంతో అక్కడ దాదాపు 3.3 కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. వెయ్యి మంది చనిపోగా, 8 లక్షల మూగజీవాలు చనిపోయాయి.

పంటలు తీవ్రంగా దెబ్బతిని ఆకలికేకలు వినపడుతున్నాయి. బాధితులకు సహాయం చేయడానికి అంతర్జాతీయ సహకారం కోరిన పాకిస్థాన్ పిలుపుకు ఇప్పటివరకు ఏ దేశం స్పందించలేదు. దీంతో మరోసారి భారతే దిక్కయింది. భారత దేశంతో తిరిగి వాణిజ్య కార్యకలాపాలకు అనుమతినిస్తున్నట్టు ఆ దేశ ఆర్ధిక మంత్రి ఇస్మాయిల్ సోమవారం ప్రకటించారు. వరదలు, పెరిగిపోతున్న ధరలు, తగ్గిన ఆహార ధాన్యాల లభ్యత వంటి కారణంగా ఈ చర్య తీసుకున్నట్టు వెల్లడించారు. ఇందులో భాగంగా ముందుగా భారత్ నుంచి కూరగాయలు, అత్యవసర సరుకులు దిగుమతి చేసుకోనున్నట్టు పేర్కొన్నారు. భారీ సంఖ్యలో నిరాశ్రయులైన పౌరుల కోసం తాజా నిర్ణయం తీసుకోవడం తప్పలేదని వివరించారు. దీంతో భారత్ కూడా సానుకూలంగా స్పందించింది. వాఘా సరిహద్దు గుండా సరుకులను పంపించడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. కాగా, ఇప్పటికే ఆర్ధిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్‌పై పిడుగులా వరదలు వచ్చి పడ్డాయి. దాంతో బాధితులను ఆదుకోవడానికి ఆ దేశం వద్ద వనరులు లేకుండా పోయాయి. మరోవైపు వరదల్లో పత్తి, వరి ఎక్కువగా పండించే సింధ్ ప్రాంతం నీట మునిగిపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు ఎలాగోలా గడచిపోయినా తర్వాత పాకిస్తాన్‌కు ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.