హైదరాబాద్ పేలుళ్ల రాక్షసుడికి పాక్ వీఐపీ భదత్ర   - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ పేలుళ్ల రాక్షసుడికి పాక్ వీఐపీ భదత్ర  

September 21, 2020

Pakistan safeguards india’s most wanted

పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గలోకమన్న సంగతి చాలా పాతదే. భారత్‌లో మారణకాండలకు పాల్పడే రాక్షసులకు పాకిస్తాన్ ప్రభుత్వం అన్నిరకాల అండదండలూ అందిస్తుంటుంది. ముంబై పేలుళ్ల దుర్మార్గుడు దావూద్ ఇబ్రహీం సహా అనేక మంది టెర్రరిస్టులు కరాచీ, ఇస్లామాబాద్, రావల్పిండిల్లో యథేచ్ఛగా చక్కర్లు కొడుతుంటారు. భారత్ మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించిన ఈ ముష్కరుల గురించి ఐక్యరాజ్యసమితికి చెందిన ఫైనాన్షియన్‌ యాక్షన్‌ టాస్క్‌ పోర్స్‌(ఎఫ్‌ఏటీఎఫ్‌) షాకింగ్ విషయాలు బయటపెట్టింది.

హైదరాబాద్‌లో 2007లో 42 మందిని బలితీసుకున్న గోకుల్‌చాట్‌, లుంబినీ పార్క్‌ పేలుళ్ల సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్ చీఫ్ రియాజ్ భత్కల్ కూడా కరాచీలో రాచమర్యాదలు అనుభవిస్తున్నట్లు ఎఫ్ఏటీఎఫ్ నివేదిక పేర్కొంది. అందులోని వివరాల ప్రకారం.. నిషేధిత ‘సిమీ’ సభ్యుడైన భత్కల్ భారత్‌లో పలు బాంబు పేలుళ్లకు పాల్పడి పాకిస్తాన్‌కు వెళ్లిపోయాడు. అలాంటి వారికి ఆశ్రయం ఇవ్వొద్దని ఐరాస చెప్పినప్పటికీ పాక్ పట్టించుకోలేదు. దావూద్ ఇబ్రహీం, సిక్కు ఉగ్రవాద నాయకుడు రంజీత్‌ సింగ్‌ నీతా తదితరులు వీరిలో ఉన్నారు. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందకుండా చర్యలు తీసుకుంటున్న ఎఫ్‌ఏటీఎఫ్‌… ఉగ్రవాదానికి జైకొట్టే దేశాలను బ్లాక్ లిస్ట్‌ జాబితాలో పెడుతుంది. ఇరాన్‌, ఉత్తర కొరియాలు మాత్రమే ఇప్పటికి ఇందులో ఉన్నాయి. ‘గ్రే’ జాబితాలో ఉన్న పాక్ నల్ల జబితాలోకి ఎక్కకుండా జాగ్రత్తలు పడుతోంది.