పాక్ పాడు బుద్ధి.. రామ మందిరంపై సంచలన ఆరోపణ  - MicTv.in - Telugu News
mictv telugu

పాక్ పాడు బుద్ధి.. రామ మందిరంపై సంచలన ఆరోపణ 

May 29, 2020

Pakistan Statement Ayodhya Temple

అయోధ్య రామాలయంపై దాయాది దేశం పాకిస్తాన్ కన్నుపడింది. దీనిపై ఆ దేశం విషప్రచారం చేయడం ప్రారంభించింది. దశాబ్ధాల కాలం తర్వాత సుప్రీం కోర్టు తీర్పుతో మందిర నిర్మాణానికి అవకాశం ఏర్పడింది. దీంతో అక్కడ ఆలయ పనులు ప్రారంభం అయ్యాయి. ఈ విషయం తెలిసిన తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. వివాదాస్పద స్థలంలో రామ మందిర నిర్మాణం చేపడుతోందని ఆరోపించింది. ముస్లింలపై వివక్ష కొనసాగుతోందంటూ ఆ దేశ విదేశాంగ శాఖ  ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. దీన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అందులో పేర్కొంది.  ఆర్‌ఎస్‌ఎస్‌ – బీజేపీలు దేశంలో హిందుత్వ అజెండాను అమలు చేస్తున్నాయని ఆరోపించింది. దీనికి సంబంధించిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన భారత నెటిజన్ల పాక్ తీరును తప్పుబడుతున్నారు. 

సుదీర్ఘ కాలం విచారణ జరిపిన తర్వాత గతేడాది నవంబర్‌లో భూ వివాదంపై సుప్రీం కోర్టు ఓ కీలక తీర్పు ఇచ్చింది.  వివాదంలో ఉన్న 2.77 ఎకరాల భూమి రామ్‌లల్లాకు చెందినదేనని స్పష్టం చేసింది. దీంతో అక్కడ రామ మందిరం నిర్మించుకోవచ్చని సూచించింది. అయితే  మసీదు నిర్మాణం కోసం.. సున్నీ వక్ఫ్ బోర్డుకు ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కూడా కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. తీర్పు తర్వాత కేంద్ర ప్రభుత్వం రామ మందిర నిర్మాణం కోసం ట్రస్టును ఏర్పాటు చేసింది. దీనికి విరాళాలను కూడా సేకరించింది. తాజాగా మందిర నిర్మాణ పనులను ప్రారంభంకావడతో పాక్ మరోసారి ఈ వ్యహహారంలో జోక్యం చేసుకోవడం విశేషం.