Home > Featured > పాక్ ఫ్రస్టేషన్‌.. దిక్కుతోచక క్షిపణి పరీక్షతో కవ్వింపు..

పాక్ ఫ్రస్టేషన్‌.. దిక్కుతోచక క్షిపణి పరీక్షతో కవ్వింపు..

కశ్మీర్ విషయంలో ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఒంటరైన పాకిస్తాన్‌ కు దిక్కు తోచడం లేదు. భారత్‌పై విద్వేషాన్ని వెళ్లగక్కడమే పనిగా పెట్టుకున్న దాయాది ధూర్తదేశం ఈ రోజు కూడా తాటాకు చప్పుడు చేసింది. ఓ బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించి చంకలు ఎగరేసుకుంది. కశ్మీర్ కోసం అణు యుద్ధానికి కూడా సిద్ధంగా ఉన్నామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, అక్టోబర్, నవంబరులో భారత్‌తో యుద్ధం జరుగుతుందని పాక్ రైల్వే మంత్రి రషీద్ చెబుతున్న నేపథ్యంలో ఈ పరీక్ష నిర్వహించారు. భారత్‌ను హెచ్చరించేందుకే దీన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది.

ఉపరితలం నుంచి ఉపరితంలోకి ప్రయోగించే గజ్నవి క్షిపణిని గురువారం తెల్లవారు జామున విజయవంతంగా పరీక్షించామని పాకిస్తాన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్వీట్ చేశారు. ఈ మిస్సైల్ 290 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదిస్తుందన్నారు. తమ అధ్యక్షుడు, ప్రధాని తమను అభినందించారన్న గఫూర్ క్షిపణి పరీక్షకు సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశారు. గజ్నవి పరిధిలోకి భారత్‌లోని చాలా భూభాగాలు ఉన్నాయి. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని పాక్ నేతలు జీర్ణించుకోని సంగతి తెలిసిందే.

Updated : 29 Aug 2019 3:24 AM GMT
Tags:    
Next Story
Share it
Top