బస్సును ఢీ కొట్టిన రైలు.. 20 మంది మృతి - MicTv.in - Telugu News
mictv telugu

బస్సును ఢీ కొట్టిన రైలు.. 20 మంది మృతి

February 29, 2020

pakistanu..

ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దాయాది దేశం పాకిస్తాన్‌లో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ఈ ప్రమాదంలో బస్సు నుజ్జునుజ్జు అయింది. సుమారు 200 మీటర్ల దూరం రైలు అలాగే లాక్కెల్లింది.

సింధ్ ప్రాంతంలోని సుక్కూరు జిల్లా రోహ్రీ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. కరాచీ నుంచి సర్గోదా వెళ్తున్న బస్సు కంధ్రా  రైల్వే క్రాసింగ్‌ను దాటే ప్రయత్నం చేసింది. అదే సమయంలో రావల్పిండి నుంచి కరాచీ వెళ్తున్న 45 అప్ పాకిస్థాన్ ఎక్స్‌ప్రెస్ రైలు బస్సును ఢీకొట్టింది. రైల్వే గేటు వద్ద ఎటువంటి సూచనలు, కాపలాదారుడు లేకపోవడంతేనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.ఈ ఘటనతో చీకట్ల బాధితుల ఆహాకారాలు మిన్నంటాయి. ఈ ఘటనపై పాక్ ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.