చైనాకు జడుసుకున్న పాక్.. టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేత  - MicTv.in - Telugu News
mictv telugu

చైనాకు జడుసుకున్న పాక్.. టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేత 

October 19, 2020

Pakistan Unblocks TikTok After Banning it For 10 Days Over 'Immoral' Content.jp

పాకిస్తాన్, చైనాకు జడుసుకున్నట్టుగానే ఉంది. ఈమధ్యే అనైతిక, అసభ్యకరమైన సందేశాలకు వేదికగా మారిందని టిక్‌టాక్‌ను పాక్ ఎత్తివేసిన విషయం తెలిసిందే. అసభ్యతతో కూడిన కంటెంట్‌  ఎక్కువగా ఉంటోందని పాకిస్తాన్ టెలీకమ్యూనికేషన్ అథారిటీ (పీటీఏ) ఫిర్యాదు మేరకు అక్టోబర్‌ 9న నిషేధం విధించింది. దీంతో చైనాకు ఊహించని షాక్‌ తగిలింది. అయితే బ్యాన్ విధించి పది రోజులు కూడా గడవకమందే పాకిస్తాన్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేసి తిరిగి పునరుద్ధరించింది. ఈ మేరకు ఆ దేశ సమాచార మంత్రిత్వశాఖ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. 

అయితే పాకిస్తాన్ మిత్రదేశం చైనా ఒత్తిడి మేరకే ఈ నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు అంటున్నారు. తొలినుంచి ఆ దేశానికి అండగా నిలుస్తున్న చైనాకు పాక్ నిర్ణయం రుచించలేదు. యాప్‌ను తిరిగి పునరుద్ధరించాలని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై ఒత్తిడి తెచ్చినట్లు అభిప్రాయపడుతున్నారు. కాగా, భద్రతా కారణాలతో భారత్‌లో టిక్‌టాక్‌ను నిషేధించిన సంగతి తెలిసిందే. సరిహద్దుల్లో చైనా దురాక్రమణకు నిరసనగా కేంద్ర ప్రభుత్వం మరికొన్ని చైనా యాప్స్‌ను సైతం నిషేధించింది. అమెరికా కూడా ఆ దిశగా యోచిస్తోంది.