ఆటలో గెలుపోటముల సంగతి అటుంచితే.. డర్హామ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ క్రికెటర్ తన సూపర్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ కౌంటీల్లో ససెక్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న రిజ్వాన్.. ఆదివారం డర్హామ్‌తో జరిగిన మ్యాచ్‌లో సంచలన క్యాచ్‌తో మెరిశాడు. డర్హామ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ససెక్స్ స్పిన్నర్ రాలిన్స్ వేసిన బంతిని స్కాట్ బోర్త్విక్ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు.
ఆ సమయంలో బాల్ ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ స్లిప్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో ఫస్ట్ స్లిప్ ఫీల్డింగ్ చేస్తున్న రిజ్వాన్.. డైవ్ చేస్తూ ఒంటి చేత్తో న క్యాచ్‌ను అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఇరు జట్లు మధ్య జరిగిన మ్యాచ్ మాత్రం డ్రాగా ముగిసింది.
This catch from @iMRizwanPak. 🤯 👏 #GOSBTS pic.twitter.com/uOdy7JJ2nr
— Sussex Cricket (@SussexCCC) May 1, 2022