లట్టు పొట్టు వార్తలను బంజెయ్యున్రి - MicTv.in - Telugu News
mictv telugu

లట్టు పొట్టు వార్తలను బంజెయ్యున్రి

June 8, 2017

పన్కచ్చే ముచ్చట్లకన్నా..టైం పాస్ ముచ్చట్లకోసాన్కే  మస్తు కష్టపడుతున్నరు మనదేశంలున్న ప్రాంతీయ,జాతీయ మీడియా వాళ్లు ,అరరే ఏం కష్టం ఏం కష్టం ..ఎవ్వరికి అక్కరకు ముచ్చట్లను పబ్లిక్కు అందించేందుకు మైకులు ముంగట పెట్కొని చెమటలు దారవోస్తున్నరు..అసలు ముచ్చటేందంటే మొన్న ఆదివారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీల భారతజట్టు పాకిస్ధానోళ్లను చిత్తు చిత్తుగ ఓడించింది,ఇది తెలిసిన పాకిస్థాన్ అభిమానులు ..పాకిస్థాన్ ఆటగాళ్లమీదున్న ప్రేమతోని తిట్లదండకం సద్వుకుంట టీవీలు తుక్కు తుక్కు  పలగ్గొట్టిన్రు,అది తెలిసిన మన మీడియావాళ్లు ఊకుంటరా టీవీలు పలగ్గొట్టిన ముచ్చట్ను టీవీలల్ల బ్రేకింగ్ న్యూస్ లెక్క రొండుమూడురోజులు ఏసుడుమీదనే ఉన్నరు,ఈరోజు  ఓ పాకిస్ధాన్ జర్నలిస్టైతె మా పాకిస్ధాన్ ఆటగాళ్లను 11 మందిని దీస్కొని మీ భారత్ జట్టులున్న విరాట్ కోహ్లీని మాకియ్యుమని ట్విట్టర్ల రాశింది గంతే,ఆపోస్టును పట్కొని కోతికి కొబ్బరిశిప్ప దొర్కినట్టు పొద్దున్నుంచి ఏస్తనేవున్నరు,సోషల్ మీడియా ఫేస్బుక్కులల్ల  ఆడ ఈడ ఏడ శ్న గిదే ముచ్చట,పాకిస్ధానోళ్లకు కోహ్లీ కావన్నట..పాకిస్ధానోళ్లకు కోహ్లీ కావన్నట,పని దిక్కులేని పంచాది గాక్పోతె దీనితోని ఎవ్వలకేమస్తది శెప్పున్రి,జర్నలిస్ట్ కొల్వులుండి ఆమేదో మాట్లాడితే దాన్ని వట్కొని బ్రేకింగ్ న్యూస్ లెక్క పబ్లిక్ తల్కాయలు దినుడు ఎందుకు శెప్పున్రి అని మీడియా మీద కొందరైతె మస్తు గరమైతున్నరు,

నిజమే విరాట్ కోహ్లీ మంచి దూకుడు మీదున్న ఆటగాడే… ఆయనకు మనదగ్గర్నే గాదు దున్యమొత్తం అభిమానులుంటరు,కనీ ఎవ్వలో ఏదో రాస్తే దాన్ని పట్టుకొని పెద్ద వార్తైనట్టు సూపెట్టుడు ఎందుకు శెప్పున్రి ఇజ్జత్ దీస్కునుడు గాక్పోతే,అరె మీకు అంత సూపియ్యాలనుకుంటే ఎన్ని వార్తలు లేవు…మధ్యప్రదేశ్ ల రుణమాఫీ జెయ్యాల్నని రైతులు రోడ్డిక్కితే…పోలీసోళ్ళు పిట్టల్ను కాల్శినట్టు కాలిస్తే..పాపం 5గురు రైతులు జీవిడిశిన్రు.అది మీకు పెద్దవార్తగాదు ఏదో ఏశినమా అంటె ఏశినం అని జూపిస్తరు..మీకు నిజంగ పబ్లిక్కు మంచి జెయ్యాలన్కుంటె రైతులు పడుతున్న బాదల్ను కష్టాల్ను నలుగురికి చూపించండి..మనసున్న మారాజులెవలన్న సాయం జేస్తరేమో..ఎంతసేపు మీ టి ఆర్ పి రేటింగులకోసం దిక్కుమాలిన ముచ్చట్లను బ్రేకింగ్ న్యూస్ లెక్క వేసీ మా దిమాక్ కరాబ్  చెయ్యకున్రి అని మొక్కుతున్నరు…పన్కిరాని వార్తలను పనిగట్టుకొని ఇంటున్న పబ్లిక్కు…మేం గుడ ఈవార్త రాయద్దనే అన్కున్నం కనీ పబ్లిక్ బాదేందో పబ్లిక్ ఏం కోరుకుంటున్రో అందరికి తెలియాలి…లట్టుపొట్టు వార్తలను బ్రేకింగ్ గా వేసెటోళ్ళకు సోయి రావాలె అని రాస్తున్నం గంతే.