టీవీ నటుడికి కువైట్ కోర్టు షాక్.. రెండేళ్ల జైలు శిక్ష - MicTv.in - Telugu News
mictv telugu

టీవీ నటుడికి కువైట్ కోర్టు షాక్.. రెండేళ్ల జైలు శిక్ష

September 18, 2020

ngb g

కువైట్ కోర్టు ఓ టీవీ నటుడికి ఊహించని షాక్ ఇచ్చింది. రెండే ళ్ల పాటు జైలు శిక్ష, వెయ్యి కువైట్ దినార్స్ జరిమానా విధించింది. పాకిస్తాన్‌కు చెందిన నటుడు ఫర్హాన్ అల్ అలీకి ఈ చేదు అనుభవం ఎదురైంది. శిక్ష పూర్తి చేసుకున్న వెంటనే తమ దేశం విడిచి వెళ్లిపోవాలని అక్కడి ధర్మాసనం ఆదేశించింది.  నగ్నంగా సోషల్ మీడియాలో కనిపించి, అనైతిక చర్యకు పాల్పడినందుకు ఈ విధమైన శిక్ష వేయడం సంచలనంగా మారింది. 

ఫర్హాన్ అల్ అలీ కువైటి టీవీ సీరియల్స్, స్టేజ్ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతనికి అక్కడ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాడు. తరుచూ స్పాప్ చాట్ ద్వారా అభిమానులతో టచ్‌లో ఉండేవాడు. ఈ క్రమంలో ఈ ఏడాది జూన్ నెలలో స్నాప్‌చాట్ ఖాతాలోని ఓ వీడియోలో నగ్నంగా అతడు కనిపించాడు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. అనైతిక చర్యను నిరసిస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. ఈ సంఘటన జరిగిన తర్వాత తన ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని  ఫర్హాన్ అల్ అలీ ఆరోపించారు. అయినా కూడా అతని వాదనతో ఏకీభవించని న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది.