నవ్వుల్ నవ్వుల్.. పాపం పాక్ విశ్లేషకుడు (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

నవ్వుల్ నవ్వుల్.. పాపం పాక్ విశ్లేషకుడు (వీడియో)

September 19, 2019

కశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు వ్యవహారం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెంచింది. ఇరు దేశాల నేతలు హెచ్చరికలతో వేడి పెంచేశారు. క్రమంగా ఇది మామూలేగా అన్నట్లు భారత్ నేతలు పాక్ నేతల్లా పెద్దగా స్పందించడం లేదు. దీంతో పాక్ నేతలు ఏదో కోల్పోయినట్లు ఫీల్ అవుతున్నారు. ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకుంటున్నారు. 

మరోపక్క.. ఈ వ్యహారంపై సోషల్ మీడియాలో నవ్వు పుట్టించే వీడియోలు, పోస్టులు హల్‌చల్ చేస్తున్నాయి. దాదాపు అన్నీ పాక్‌కు భంగపాటు కలిగించేవే కావడం విశేషం. భారత్‌లో పాకిస్తాన్‌ హైకమిషనర్‌గా పనిచేసిన అబ్దుల్‌ బాసిత్‌ ఇటీవల బ్లూఫిల్మ్‌ స్టార్‌ ఫొటోను పెట్టి కశ్మీర్ పోలీసుల పెల్లెట్ల దాడిలో గాయపడినట్లు బొంకి అడ్డంగా బుక్కయ్యాడు. టీవీ చర్చల్లోనూ సరదా సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జీటీవీ అనే పాక్ చానల్లో కశ్మీర్ అంశంపై సాగిన చర్చ నవ్వు పుట్టిస్తోంది. ప్రముఖ పాక్ రాజకీయ విశ్లేషకుడు, పాత్రికేయుడు మజర్ బర్లాస్ చర్చలో పాల్గొన్నాడు. అతడు తన వంతు రాగానే కశ్మీర్‌పై మాట్లాడబోతూ దబ్బున కిందపడిపోయాడు. కుర్చీ తొణకడంతో ఆయన పడిపోయాడు. చర్చలో పాల్గొంటున్న వ్యక్తులు నవ్వుతూ అతణ్ని పైకి లేపారు. దీంతో సమన్వయకర్త కూడా షాక్‌తో నాలుక కర్చుకోవడం మరింత నవ్వు పుట్టిస్తోంది. ఆ వీడియోనూ మీరూ చూసేయండి మరి.