లాక్‌డౌన్‌లో బయటకెళ్తే రోడ్డుపై వంగోబెట్టేస్తున్నారు - MicTv.in - Telugu News
mictv telugu

లాక్‌డౌన్‌లో బయటకెళ్తే రోడ్డుపై వంగోబెట్టేస్తున్నారు

March 24, 2020

gbcgb

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశంలో అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలని, అది కూడా కుటుంబంలోఒక్కరు మాత్రమే బయటికి రావాలని ప్రభుత్వాలు ఆదేశించాయి. అయినా కూడా కొందరు ఆకతాయిలు రోడ్లపైకి వస్తున్నారు. దీంతో పోలీసులు వాళ్లపై లాఠీలతో విరుచుకపడుతున్నారు. రోడ్లపైకి వస్తున్న వాళ్ళను పోలీసులు కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇదిలా ఉంటే, పొరుగు దేశం పాకిస్తాన్‌లో కూడా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. దీంతో కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టడానికి అక్కడ కూడా కొన్ని నగరాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా బయటకు వస్తే చాలు అప్పటికప్పుడు శిక్షలు విధిస్తున్నారు. ఇండియాలో పుణె పోలీసులు గుంజీలు తీయించినట్లే.. పాకిస్తాన్‌లో కూడా అలాంటి శిక్షలు వేస్తున్నారు. సింద్ ప్రాంతంలో రోడ్లపై తిరుగున్న కొంతమందిని ఇలా వంగోబెట్టారు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.