Home > Featured > నుపుర్ శర్మను చంపడానికి భారత్‌లోకి చొరబడిన పాకిస్తానీ

నుపుర్ శర్మను చంపడానికి భారత్‌లోకి చొరబడిన పాకిస్తానీ

బీజేపీ బహిష్కృత నాయకురాలు నుపుర్ శర్మ మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలపై ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు హత్యా బెదిరింపులను ఎదుర్కొంటున్న ఆమెను చంపడానికి ఓ పాకిస్తానీ యువకుడు సరిహద్దు దాటి మరీ వచ్చాడు. బీఎస్ఎఫ్ సైనికులు అతణ్ని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. పాక్ పంజాబ్ రాష్ట్రంలోని కతియాల్ షేకా ప్రాంతానికి చెందిన రిజ్వాన్ అశ్రాఫ్(24) అనే వ్యక్తి ఈ నెల 16న అర్ధరాత్రి రాజస్తాన్‌లోని శ్రీగంగానగర్ జిల్లా హిందుమల్‌కోట్ ప్రాంతంలో తచ్చాడుతుండగా భారత జవాన్లు పట్టుకుని విచారించారు. ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మను చంపడానికే వచ్చానని రిజ్వాన్ చెప్పుకొచ్చాడు. అతని బ్యాగ్‌లో 11 అంగుళాల పొడవైన కత్తి, మతప పుస్తకాలు, బట్టలు, రొట్టెలు బయటపడ్డాయి. నుపుర్ శర్మను చంపడానికి ముందు అజ్మీర్ దర్గాను సందర్శించడానికి వచ్చానని చెప్పుకొచ్చాడు.
కాశీలోని గ్యాన్‌వాపీ మసీదులో శివలింగం వివాదంపై స్పందిస్తూ నుపుర్ శర్మ ప్రవక్తపై వ్యాఖ్యలు చేశారు. అయితే అవి ప్రవక్తను కించపరిచేలా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. కొందరు ఆమె తలకు వెల కట్టారు. దీంతో ప్రభుత్వం ఆమెకు భద్రత కల్పిస్తోంది.

Updated : 20 July 2022 6:43 AM GMT
Tags:    
Next Story
Share it
Top