ఆ పాపపేరు పౌరసత్వం.. అదే ఎందుకంటే..! - MicTv.in - Telugu News
mictv telugu

ఆ పాపపేరు పౌరసత్వం.. అదే ఎందుకంటే..!

December 12, 2019

Pakistani 02

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుపైతో భారత పౌరసత్వం కోసం శరనార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమ ఆకాంక్ష నెరవేరే సమయం వచ్చిందనే సంతోషంతో ఉన్నారు. వీరిలో ఓ చిన్నారి పేరు ఆసక్తి మారింది. బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా ఆ చిన్నారి తన పేరును నాగ్రిక్త ( సిటిజన్ షిప్)గా పెట్టుకొని భారత పౌరసత్వం కోసం ఎదురుచూస్తోంది. 

పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందూ శరనార్థులైన ఓ కుటుంబం  ఢిల్లీలోని మజ్ను కా తిలా ప్రాంతంలో నివసిస్తోంది. 2012లో ఈ కుటుంబం భారత్‌కు వచ్చింది. అప్పటి నుంచి తమ పౌరసత్వం కోసం  ఏడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇన్నాళ్లకు తమకు అనుకూలంగా బిల్లు ఆమోదం పొందడంతో తామంతా పౌరసత్వం కోసం వేచి చూస్తున్నామని చెబుతున్నారు. కాగా మజ్ను కా తిలా ప్రాంతంలోని పునరావాస కాలనీల్లో దాదాపు 750 హిందూ శరణార్థ కుటుంబాలు నివసిస్తున్నాయి.వీరంతా పాకిస్తాన్ నుంచి శరణార్థులుగా వలస వచ్చినవారే కావడం విశేషం.