పావురం పెంట తింటే కరోనా రాదు.. పాక్ మతపెద్ద - MicTv.in - Telugu News
mictv telugu

పావురం పెంట తింటే కరోనా రాదు.. పాక్ మతపెద్ద

June 5, 2020

 

Pakistani preacher.

ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్‌కు మందే లేదు. రెండు మూడు నెలల్లో వచ్చేస్తుందని మొన్నటి వరకు ఊదరగొట్టిన డాక్టర్లు ప్లేటు మార్చి మరో రెండు మూడేళ్లు పట్టొచ్చని చెబుతున్నారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ వంటి ఔషధాలతో రోగులకు కాసింత ఉపశమనం కలిగిస్తున్నారు. మరోపక్క అసలు కరోనా గురించి భయపడాల్సిన పనే లేదంటూ పాకిస్తాన్‌లోని ఓ మతపెద్ద పెంట మందు సూచించాడు. 

పావురాల పెంటను నీటిలో కలుపుకుని తాగితే కరోనా తోక ముడుస్తుందని పీర్ పంజర్ సర్కార్ అనే ముల్లా భక్తులకు బోధిస్తున్నాడు. ‘నేను అద్భుతమై మందు కనిపెట్టాను. దీనికి అల్లా కూడా ఆమోదం తెలిపాడు. పావురాల పేగుల్లోంచి జీర్ణంకాని ‘పోటా’ను తీసుకోండి.తర్వాత పొట్టలోని ద్రవాలు తీసుకోండి. వాటిని నీటిలో ఉడికించి తాగండి.. మీకు కరోనా చచ్చినా రాదు.. ’ అని చెబుతున్నాడు. దీనిపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. పాకిస్తాన్‌లో పావురాలతో ఇలాంటి పనికిమాలిన వైద్యాలు మామూలే. వాటిని పొట్టపై పెడితే మూత్రపిండాల్లోని రాళ్ల కరిగిపోతాయనే నమ్మకాలు కూడా ఉన్నాయి.