చైనా చీప్ ట్రిక్స్.. పాక్ ఉగ్రవాదులతో భారత్‌పై కుట్ర  - MicTv.in - Telugu News
mictv telugu

చైనా చీప్ ట్రిక్స్.. పాక్ ఉగ్రవాదులతో భారత్‌పై కుట్ర 

July 1, 2020

Pakistani Troop Movement in Ladakh

లడాక్ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గించడం కోసం ఓ వైపు చర్చలు అంటూనే మరోవైపు చైనా కయ్యానికి కాలు దువ్వుతోంది. ఎప్పుడు భారత్‌పై విషం కక్కుదామా అని ఆలోచించే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో డ్రాగన్ సంప్రధింపులు జరుపుతున్నట్టుగా ఐబీ గుర్తించింది. జమ్మూ కాశ్మీర్‌లో హింసను రెచ్ఛగొట్టేందుకు కుట్రలు చేస్తోంది. దీని కోసం పాక్ ఉగ్రవాద సంస్థ..‘ఆల్ బదర్’ తో సంప్రదింపులు జరుపినట్టుగా భారత్ గుర్తించింది. కరుడు గట్టిన ఈ ఉగ్రవాదులను ఉసిగొల్పి రక్తపాతం సృష్టించే విధంగా నీచ ఎత్తుగడ వేయడంతో భద్రతా బలగాలు మరింత అప్రమత్తం అయ్యాయి. 

మరోవైపు దాయాది పాక్ కూడా చైనాకు వంత పాడుతోంది. భారత్‌పై విషం కక్కేందుకు అవకాశం రావడంతో డ్రాగన్ సైన్యంతో చేతులు కలిపింది. గిల్గిట్-బల్టిస్తాన్ ప్రాంతానికి చైనా సైనికులతో పాటు పాకిస్తాన్ నుంచి సుమారు 20 వేల మంది సైనికులను తరలించినట్టుగా సమాచారం. అటు సరిహద్దుల వద్ద కవ్వింపు చర్యలు.. ఇటు భారత భూ భాగంలో స్థానికులను రెచ్చగొట్టి రక్తపాతం సృష్టించేలా దాడులకు తెగబడుతోంది. కాగా ఇప్పటికే జమ్మూ కశ్మీర్‌లో తిష్టవేసిన 120 మంది ఉగ్రవాదులను ఈ ఏడాది సైన్యం మట్టుబెట్టింది. ఈ రోజు ఉదయం కూడా ఉగ్రవాదులు తెగబడటంతో ఓ సామాన్యుడు మరణించాడు. చైనా తీరును ఎప్పటికప్పుడు గమనిస్తున్న భారత్ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తుందనేది ఆసక్తిగా మారింది.