ఆడపిల్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వను.. పాకిస్తాన్‌లో అంతే! - MicTv.in - Telugu News
mictv telugu

ఆడపిల్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వను.. పాకిస్తాన్‌లో అంతే!

September 21, 2020

Pakistani Woman Denied A Bike License

21 శతాబ్దంలో కూడా కొన్ని దేశాల మహిళలు వెనకబాటుతనాన్ని అనుభవిస్తున్నారు. మిగతా దేశాల మహిళల మాదిరి స్వేచ్ఛగా బతకలేకపోతున్నారు. ఓటు హక్కు, డ్రైవింగ్ లైసెన్సు వంటివి పొందడానికి కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల పాకిస్తాన్‌లో జరిగిన ఓ సంఘటనే ఇందుకు నిదర్శనం. ఆ దేశానికి చెందిన శిరీన్‌ అనే అమ్మాయి డ్రైవింగ్ లైసెన్సు తీసుకోవాలనుకుంది. డ్రైవింగ్‌ లైసెన్సు కోసం ఆర్టీఏ ఆఫీసుకి వెళ్లింది. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ఆ తరువాత డ్రైవింగ్ పరీక్షలో కూడా పాస్ అయింది.

కానీ, చివరికి అమ్మాయిలకు నేను డ్రైవింగ్‌ లైసెన్సును ఇవ్వలేనని ఆర్టీఏ అధికారి అన్నాడు. దీంతో శీరీన్ ఒక్కసారిగా షాక్ అయింది. రాత పరీక్ష, డ్రైవింగ్ పరీక్ష పాసైన నాకు డ్రైవింగ్ లైసెన్సు ఎందుకు ఇవ్వరని ఆ అధికారిని నిలదీసింది. ఆడపిల్లలు బండ్లు పడేస్తారు అందుకే ఇవ్వనని ఆ అధికారి ఎంతో నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. శీరీన్ ఎంత అడిగినా ఆ అధికారి లైసెన్సు ఇవ్వలేదు. బైక్‌పై నుంచి పడితే నీకు దెబ్బలు తగులుతాయని కాకమ్మ కబుర్లు చెప్పాడు. దీంతో కోపాద్రిక్తురాలైన శిరీన్‌ ఏకంగా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి ట్వీట్ చేసింది. ‘ఏమిటి రూల్? ఏమిటి పాలన? అమామ్యిలకు ఈ దేశంలో డ్రైవింగ్ లైసెన్సు ఇవ్వరా?’ అని నిలదీసింది. దీనిపై ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ ఆ అమ్మాయికి డ్రైవింగ్ లైసెన్సు ఇవ్వాల్సిందిగా సదరు ఆర్టీఏ అధికారిని ఆదేశించాడు. దీంతో ఆ అమ్మాయికి డ్రైవింగ్ లైసెన్సు వచ్చింది. తరువాత ఆ శీరీన్ ప్రధానికి ట్విట్టర్ వేదికగా కృతఙ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం ఆమె ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ధైర్యసాహసాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.