ద్రోహం చేశావ్.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్‌కు జైలు శిక్ష - MicTv.in - Telugu News
mictv telugu

ద్రోహం చేశావ్.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్‌కు జైలు శిక్ష

February 8, 2020

Pakistan's cricketer.

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ నాసిర్ జంషెడ్‌కు 17 నెలలు జైలు శిక్ష పడింది. గత ఏడాది పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో స్ఫాట్ ఫిక్సింగ్‌కి ఆటగాళ్లను ప్రేరేపించినట్లు అతనిపై నేరం రుజువైంది. దీంతో మాంచెస్టర్ క్రౌన్ కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది. నాసిర్ జంషెడ్ 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో పాకిస్తాన్ తరపున 48 వన్డేలాడాడు. 2015 తర్వాత పాక్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పి ఇంగ్లాండ్‌కి వెళ్లి కౌంటీల్లో ఆడుతున్నాడు. 

గత ఏడాది బ్రిటన్‌కి చెందిన యూసఫ్ అన్వర్, మహ్మద్ ఇజాజ్‌తో కలిసి ఫిక్సింగ్‌ కోసం పాకిస్తాన్ క్రికెటర్లని జంషెడ్ ప్రలోభాలకి గురిచేశాడు. 2019లో జరిగిన పీఎస్‌ఎల్ సీజన్‌లోనూ పాక్ ఆటగాడు షార్జీల్‌‌తో ఫిక్సింగ్ చేశాడు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. షార్జీల్‌పై ఐదేళ్లు, జంషెడ్‌పై పదేళ్ల పాటు నిషేధం విధించింది. ఇక జంషెడ్‌తో కలిసి పనిచేసిన మరో క్రికెటర్ ఖాలిద్ లతీఫ్‌పైనా ఐదేళ్ల నిషేధం పడింది. 2016లో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లోనూ జంషెడ్ ఫిక్సింగ్‌కి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి.