భారత్ లాగానే ట్రై చేసి..పరువు పోగొట్టుకున్న పాక్ రేడియో!
భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఇకపై పీవోకే ప్రాంతాల్లోనూ వాతావరణ సూచనలు జారీ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం పాక్ ఆధీనంలో ఉన్న గిల్గిట్-బాల్టిస్థాన్, ముజఫరాబాద్‌లో వాతావరణ మార్పులకు సంబంధించిన హెచ్చరికలను జారీ చేయనున్నట్లు ఐఎండీ ప్రకటించింది. ఈ చర్య ద్వారా కశ్మీర్ మొత్తం భారత్‌కు చెందినదేనంటూ మరోసారి స్పష్టం చేసింది.
భారత్ చర్యకు దీటుగా జవాబిద్దామనే తొందరలో పాకిస్థాన్ రేడియో పరువు పోగొట్టుకుంది. ఆ సంస్థ ఇటీవల చేసిన ట్వీట్‌లో దొర్లిన పొరపాటు కారణంగా నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పాక్ రేడియో లడాఖ్ లోని గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతల సమాచారాన్ని ట్వీట్ చేసింది. గరిష్ట ఉష్ణ్రోగ్రత -4 డిగ్రీలని, కనిష్ట ఉష్ణోగ్రత -1 డిగ్రీలని ట్వీట్ లో పేర్కొంది. అయితే గణిత శాస్త్రం ప్రకారం పెద్ద సంఖ్య అయిన -1ని కనిష్ట ఉష్ణోగ్రతగా పేర్కనడాన్ని నెటిజన్లు గుర్తించారు. దీంతో పాక్ రేడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పాకిస్తాన్ రేడియో సంస్థ ఆ ట్వీట్ ను తొలగించింది. అయితే అప్పటికే ఆ ట్వీట్ ను స్క్రీన్ షాట్ తీసిన నెటిజన్లు దానిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
In #Pakistan -4 is greater than -1 !
The national FM transmitter of Pak @RadioPakistan forecast weather of #Ladakh .@ImranKhanPTI pic.twitter.com/RSi9FOjtMG
— Bhawani Shankar ?? (@Bhawanispeaks) May 10, 2020