pakisthan actress sehar shinwary gives offer to zimbzbwe team
mictv telugu

టీమిండియాను ఓడిస్తే ఆ దేశస్తుడిని పెళ్లి చేసుకుంటా – పాక్ నటి అక్కసు

November 3, 2022

pakisthan actress sehar shinwary gives offer to zimbzbwe team

పాకిస్తాన్ నటి సెహర్ షిన్వారీ జింబాబ్వే క్రికెట్ టీంకి బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ దేశాన్ని ఓడించినట్టే.. ఇండియాను వరల్డ్ కప్‌లో ఓడిస్తే మీ దేశానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని ట్వీట్ చేసింది. అంతకు ముందు బుధవారం బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కింది. ఇండియా ఓడిపోవాలని పదే పదే ట్వీట్లు చేసింది. దీంతో భారత నెటిజన్లు ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. ఇలా అయితే మీకు ఎప్పటికీ పెళ్లి కాదని, జింబాబ్వే ఓడిపోతే మీరు ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేయాలని, ఒక్క పరుగుతో ఓడిపోవడానికి మాది పాకిస్తాన్ జట్టు కాదంటూ కామెంట్లు పెడుతూ ట్రోల్ చేస్తున్నారు. కాగా, బుధవారం బంగ్లాదేశ్‌తో మ్యాచ్ గెలిచిన టీమిండియా.. నవంబర్ 6న జింబాబ్వే జట్టుతో తలపడనుంది. పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉంది. వచ్చే మ్యాచులో కూడా గెలిస్తే సెమీస్ బెర్త్ ఖాయం అవుతుంది.