నన్ను దించేందుకు ఆదేశం కుట్ర.. ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణ - MicTv.in - Telugu News
mictv telugu

నన్ను దించేందుకు ఆదేశం కుట్ర.. ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణ

April 1, 2022

13

విదేశీ శక్తుల సహాయంతో తనను పదవి నుంచి దింపే కుట్ర జరుగుతోందని ఇప్పటివరకూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకుంటూ వచ్చారు. తాజాగా ఆ దేశం పేరును బయట పెట్టారు. పాకిస్తాన్‌కు చెందిన ముగ్గురి సహాయంతో అమెరికా తన కుట్రను అమలు చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. తాను అధికారంలో ఉంటే ఇరు దేశాల సంబంధాలు దెబ్బతింటాయనే భయంతో బైడెన్ ఈ చర్యకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఉక్రెయిన్‌కు మద్ధతుగా వ్యవహరించాలని నాటో దేశాల కోరికను తిరస్కరించినందుకు పాకిస్తాన్‌ను బలి పశువును చేస్తున్నారని మండిపడ్డారు. యుద్ధం ముందు రోజు మాస్కోకు వెళ్లడం నచ్చని దేశాలే కుట్రను ప్రధానంగా అమలు చేస్తున్నాయని ఆరోపించారు. కాగా, ఇమ్రాన్ ఆరోపణలను అమెరికా ఖండించింది. ఇదిలా ఉండగా, ఇమ్రాన్ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ ఈ నెల 3న జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు పదవిలో ఉండగా ఇమ్రాన్ చేసిన పనుల వల్ల దేశానికి చాలా నష్టం వాటిల్లిందని అక్కడి మేధావులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇమ్రాన్ పోతూ పోతూ కూడా అమెరికా, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలతో పాకిస్తాన్‌కు శత్రుత్వం పెట్టి పోతున్నారని, దీన్ని అధిగమించడం వచ్చే ప్రభుత్వానికి సవాలుతో కూడుకున్నదని వారు అభిప్రాయపడుతున్నారు.