పాకిస్థాన్ కే ఆమె ఆదర్శం..! - MicTv.in - Telugu News
mictv telugu

పాకిస్థాన్ కే ఆమె ఆదర్శం..!

June 13, 2017


”ఆడవాళ్లు”ప్రపంచంలో ఎక్కడ చూసినా ఎంతో కొంత వివక్షకు గురయ్యేవాళ్లు.ఆడవాళ్లంటే వంటింటి కుందేళ్లు..పిల్లలు కనే యంత్రాలు, లైఫ్ టైం జీతం తీసుకోకుండా మనకు సేవచేసే పనివాళ్లు అని ముద్రవేసి వాళ్లను వాటికే పరిమితం చేసిన కొందరు మగాళ్లకు … దైర్యంగా ముందుకువచ్చి మీరు మాకంటే ఎందులో గొప్ప…మేమూ మీలాగా అన్ని రంగాల్లో రాణించగలం అని నిరూపించినారు ఎందరో ఆడవాళ్ల.పాకిస్ధాన్” ప్రపంచంలో ఆడవాళ్లమీద చూపే వివక్ష కన్నా ఇక్కడ కొంచెం ఎక్కువనే చెప్పాలి,ఇంట్లోనుంచి ఎక్కడికి వెళ్లకూడదు ఒకవేళ వెళ్లినా బుర్ఖానో లేదా నెత్తిమీద చున్నీయో వేస్కోని వెళ్లాస్సిందే..ఇంట్లో దించిన తల మళ్ళీ ఇంట్లోకి వచ్చేదాక అలాగే ఉండాలె,ఇది పాకిస్ధాన్ లో చాలా చోట్ల మహిళల పరిస్దితి.

పర్వీన్ బీబీ పాకిస్ధాన్ లోని లాహోర్ లో ఉంటుంది.వయసు దాదాపు యాబైనుంచి అరవై మధ్యలో ఉంటుంది,సంపాదించే భర్త అకస్మాత్తుగా చనిపోయాడు,నాతో పాటు ఒక కూతురు.. ఆకూతురికి పుట్టిన ముగ్గురు ఆడపిల్లలు,సంపాదించి పెట్టే మగదిక్కులేరు.. ఎలా వాళ్లను పోషించాలి,మనుమరాళ్ల భవిషత్తును ఎలా చక్కదిద్దాలి అనే ఆలోచనలతో సతమతమౌతున్న పర్ వీన్ బీబీకి ఒక వార్త కళ్లముందు మెదిలింది,అదేంటంటే పాకిస్ధాన్ లో కొందరు ఆటోడ్రైవర్లు ఆడవాళ్లపై చేస్తున్న అరాచకాలు..వరుసగా జరుగుతున్న మాన‎భంగాలు…అంతే ఒక్కసారిగా ఆమె మనసులో ఓ ఆలోచన వచ్చింది అదే ”పింక్ ఆటో”.

మనదేశంలో చాలా చోట్ల ఈ పింక్ ఆటోలు ఉన్నాయి. ధైర్యంగా ఎంతో మంది మహిళలు వీటిని నడుపుతున్నారు కానీ అది పాకిస్ధాన్.మహిళలకుండే కట్టుబాట్లు ఎక్కువ.అయినా సరే పర్వీన్ అదైర్య పడలేదు, అడుగు ముందుకేసింది. పింక్ ఆటో సర్వీస్ ను లాహోర్ లో స్టార్ట్ చేసింది,ఈక్రమంలో ఎన్నోబెదిరింపులు ఎన్నో వెక్కిరింతలు ఆటో నడిపే మొగవారు ఐతే ఆశ్చర్యంగా చూసేవారట,ఐనా ఎవ్విట్నీ లెక్కచెయ్యలేదు,కుటుంబ అవసరాలకోసం స్టీరింగ్ పట్టింది..పగలు రాత్రి తేడాలేకుండా ఆటోను నడిపేది.ఆడవాళ్లు ఈమె ఆటోల ఎక్కితే కంఫర్ టబుల్ గా ఫీలయ్యే వారట,ఇంట్లోవాళ్లతో ప్రయాణం చేస్తున్న ఫీలింగ్ వాళ్లకు కలిగేదట,చాలా సేఫ్టీగా అనిపించేదట,ఇంకే పర్వీన్ ధైర్యంచేసి వేసిన ఆ అడుగు ఇప్పుడెంతోమందికి దారి చూపింది.

ఆమెలాగా ఇప్పుడు చాలామంది మహిళలు అక్కడ పింక్ ఆటోలు నడుపుతున్నారట.కట్టుబాట్లకు కట్టుబడి వంటింటి కుందేళ్లుగా బతుకుతున్నచాలామంది మహిళలకు ఆదర్శంగా నిలిచిన పర్వీన్ బీబీకి ఆమె దైర్యానికి అక్కడివారు సలాం చేస్తున్నారట…కానీ నేటి సమాజంలో ఆడపిల్లలకు ప్రపంచంలోనే కాదు అమ్మకడుపులో కూడా సేఫ్టీలేని నీచమైన దరిద్రమైన సొసైటీలో బతుకుతున్నాం…ఆడపిల్ల అని తెలిస్తే చాలు అబార్షన్లు,వాళ్లను పెంచి పెద్దచేసి కట్నాలు కానుకలు ఇచ్చి పెళ్లిళ్లు చెయ్యాలి అని భయపడే ఎందరో తండ్రుల మైండ్ సెట్ లో మార్పు రావాలి,ఆడవాళ్లంటే కేవలం శృంగారానికి పనికచ్చే ప్రాణమున్నవస్తువు అని ఆలోచించే మగాడి బుద్దిలో మార్పురావాలి,మహిళ ఎక్కడికెళ్లినా తను సేఫ్టీ సమాజంలో ఉన్నాను అనే ధైర్యం వాళ్లకు రావాలి.అప్పుడు ప్రతీ ఇంట్లోను ఓ సానియామీర్జా ఓ మదర్ ధెరిస్సా ఓ లతామంగేష్కర్ ఇలా అన్ని రంగాల్లో మీఇంటినుంచే ఓ శక్తి పుట్టుకస్తుంది.