Pakka Commercial and The Warrior Movies Ott Release Dates And Streaming Platforms Announced
mictv telugu

ఓటీటీలోకి ‘పక్కా కమర్షియల్’ , ‘ది వారియర్’

July 31, 2022

వారం రోజుల వ్యవధిలో ఓటీటీలో రెండు తెలుగు సినిమాలు సందడి చేయబోతున్నాయి. సినీ అభిమానులు ఆ స్టార్ హీరోల సినిమాలు చూసేందుకు సిద్ధమవుతున్నారు. అందులో ఒకటి గోపీచంద్‌ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కించిన ‘పక్కా కమర్షియల్‌’. జులై 1న థియేటర్లలో విడుదలై సందడి చేసిన ఈ సినిమా అతి త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది. ‘ఆహా’లో ఆగస్టు 5 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు సంస్థ ట్విటర్‌లో ఓ గ్లింప్స్‌ను విడుదల చేసింది. అదే రోజు మరో ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లోనూ ఈ సినిమా విడుదల కానుందని సమాచారం. ‘యాక్షన్- కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో గోపీచంద్‌, రాశీఖన్నా లాయర్లుగా నటించారు. సత్యరాజ్‌, రావు రమేష్‌, అజయ్‌ ఘోష్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఇక ఎనర్జటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ‘ది వారియర్’ మూవీ కూడా ఓటీటీలోకి రానుంది. కృతి శెట్టి హీరోయిన్‌‌గా, తమిళ స్టార్ డైరెక్టర్ ఎన్‌.లింగు స్వామి దర్వకత్వంలో రూపొందిన ఈ సినిమా జులై 14న ఆడియన్స్ ముందుకు వచ్చింది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. తాజాగా ది వారియర్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఆగస్టు 11వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఓ గ్లింప్స్‌ను విడుదల చేస్తూ.. నిర్వాహకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సినిమాలో తొలిసారి రామ్ పోతినేని పోలీస్ ఆఫీసర్ పాత్రలో అదరొట్టేశాడు. ఆది పినిశెట్టి విలనిజం ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాకు బాక్సాఫీసు మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. బిగ్‌ స్క్రీన్‌పై ఈ రెండు సినిమాలను చూడలేకపోయిన అభిమానులు.. ఓటీటీలో చూసేందుకు రెడీ అవుతున్నారు.