పాకిస్థాన్..మరో శ్రీలంకగా మారుతుంది. దాయాది దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి.. సాయం కోసం ఇతర దేశాల వైపు ఆశగా ఎదురు చూస్తోంది. ఆర్థిక సంక్షోభంతో ఉద్యోగులు సైతం తమ జీతాలను అందుకోలేకపోతున్నారు. రోజురోజుకి పరిస్థితి మరింత దిగజారిపోతుండడంతో.. ఆర్థిక కష్టాల నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు పాకిస్థాన్ నానా ప్రయత్నాలు చేస్తుంది.తాజాగా పాక్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకోంది.
విదేశాల్లో ఉన్న ఆస్తులను అమ్మేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే అమెరికాలో పాక్ దౌత్య కార్యాలయ భవనానికి అమ్మకానికి పెట్టింది. వాషింగ్టన్ లోని మూడు చోట్ల పాకిస్థాన్ దౌత్య విభాగానికి ఆస్తులు ఉన్నాయి. వాటిలో ఒకదాన్ని అమ్మకానికి పెడుతున్నట్టు పాక్ వర్గాలు తెలిపాయి. దీనిని అమ్మేందుక పాక్ కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ భవనం కోసం ఇప్పటిదాకా మూడు బిడ్లు దాఖలైనట్టు డాన్ దినపత్రిక వెల్లడించింది. అత్యధికంగా రూ.56 కోట్లకు యూదులకు చెందిన ఓ సంస్థ బిడ్ వేసింది. భారత్ కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి రూ.41 కోట్లకు బిడ్ దాఖలు చేయగా, పాకిస్థానీ రియల్టర్ ఒకరు రూ.33 కోట్లకు బిడ్ వేశారు.