palak paneer is biggest nutritional mistake
mictv telugu

పాలక్ పనీర్ తింటున్నారా….అయితే దీన్ని మీరు కచ్చితంగా తెలుసుకోవాలి.

November 10, 2022

భారతదేశం వంటలు అనగానే గుర్తొచ్చేవి కొన్ని ఉన్నాయి. అందులో కచ్చింతగా ఉండేది పాలక్ పనీర్. పాలకూర, పనీర్ కలిపి చేసే ఈ కూర అంటే ఇష్టడని భారతీయుడు ఉండడు. పెద్దగా స్పైసీ లేకుండా ఉంటుంది కాబట్టి దీన్ని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పాలకూరలోని, పన్నీర్ లోని కూడా బోలెడు న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఇది మన హెల్త్ కి కూడా చాలా మంచిదని చెబుతుంటారు. డైట్ చేసే వాళ్ళు కూడా దీన్ని తినాలి అని సజెస్ట్ చేస్తుంటారు.

 

పాలకూరలో ఐరన్, విటమిన్లు సమృద్ధిగా ఉంటుంది. పన్నీర్ లో ప్రొటీన్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. పాలకూర తింటే రక్తం స్థాయి పెరుగుతుంది. హిమోగ్లోబిన్ ఎక్కువ అవుతుంది. అంతేకాదు ఆకు కూరల్లో ఉండే హై న్యూటిషన్ వ్యాల్యూస్ అన్నీ ఇందులో భేషుగ్గా ఉంటాయి. అన్ని ఆకు కూరల కంటే పాలకూర బెస్ట్ అంటారు కూడా.

ఇక పన్నీర్ విషయానికి వస్తే ఇది నాన్ వెజ్ వాళ్ళ మీట్. ఇందులో ప్రొటీన్ చాలా ఎక్కవు ఉంటుంది. పాలతో తయారు చేస్తారు కాబట్టి కాల్షియం కూడా అధికంగానే ఉంటుంది. డైట్ చేసే వాళ్ళు, నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటే పన్నీర్ ను కచ్చితంగా తీసుకోమని చెబుతుంటారు.

రెండు హై న్యూట్రిషన్ వాల్యూ ఉన్న పదార్ధాలు తింటే మరికొంచెం ఎక్కువ ఫలితాలు వస్తాయి. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. కానీ అక్కడే మనందరం పాలక్ పన్నీర్ లో కాలేస్తాం. నిజానికి ఈ రెండూ అస్సలు కలిపి తినకూడదు అంట. పాలక్, పన్నీర్ కలిపి తినడం వల్ల పాలకూరలోని గుణాలు అన్నీ పోతాయిట. ఈ రెండింటినీ కలిపి వండినప్పుడు పన్నీర్, పాలకూర్ ను డామినేట్ చేసి అందులో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ ను చంపేస్తందిట. అప్పడు అందులో పాలకూర ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అంటున్నారు. అలాగే పన్నీర్ లో ఉన్న గుణాలు కూడా తగ్గిపోతాయి అని చెబుతున్నారు. దీని బదులు రెండింటినీ విడివిడిగా తినడమే మంచిదని సలహాలు ఇస్తున్నారు డైట్ ఎక్స్ పర్ట్స్.

అదండీ సంగతి పాలక్ పన్నీర్ తినడానికి మహా రుచిగా ఉన్నా దానివల్ల మన ఆరోగ్యానికి ఏమీ ఫలితం ఉండదు. రుచి కోసం కావాలంటే తినండి కానీ డైట్ చేసే వాళ్ళఉ మాత్రం అవాయిడ్ చేయండి అని చెబుతున్నారు. దాని బదులు పాలక్ దాల్, పాలక్ కర్రీ చేసుకుని తింటే మంచిదని సూచనలు ఇస్తున్నారు.